మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలో గడప గడపకి కాంగ్రెస్ జోరుగా సాగుతోంది. మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మేడ్చల్ మండలం రాజబొల్లారం, రాజబొల్లారం తాండా, అక్బాపురం, ఘనాపూర్ , పుడూర్ గ్రామలలో గడప గడపకి కాంగ్రెస్ కార్యక్రమంలో తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని కాంగ్రెస్ వచ్చాక భూములు ఇచ్చి పట్టా చేస్తుంది అని, రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం అని వజ్రేష్ యాదవ్ అన్నారు.