వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా చెన్నమనేని వికాస్ రావు నామినేషన్ వేశారు. దీంతో వేములవాడ బీజేపీ టికెట్పై ఉత్కంఠ వీడినట్టయింది. వేములవాడ బీజేపీ ఎమ్మెల్యేగా తుల ఉమ పేరును ముందుగా ప్రకటించారు. తాజాగా ఆమె పేరును తొలగించి.. నామినేషన్ చివరి క్షణాల్లో వికాస్ రావుకి అధిష్టానం టికెట్ కేటాయించింది.
శుక్రవారం ఉదయం తుల ఉమ, వికాస్ రావు ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. వేములవాడ బీజేపీ టికెట్ ను తుల ఉమకు కేటాయించడంతో నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిరసనలు తెలిపారు. కొంతకాలంగా వేములవాడ టికెట్ పై బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లుగా విబేధాలు కొనసాగాయి. మొత్తానికి చివరి క్షణంలో వికాస్ రావుకే బీజేపీ పార్టీ బీ ఫామ్ అందజేసింది. నామినేషన్ దాఖలు చేసిన వికాస్ రావు.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r