హైదరాబాద్ నిజాం కాలేజీలో పరీక్షలు బైకాట్ చేశారు డిగ్రీ విద్యార్థులు. డిగ్రీ పరీక్షలు రాయకుండా ఆందోళన చేస్తున్నారు నిజాం విద్యార్థులు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లు రాజీనామా చేయాలనే ముఖ్యమైన డిమాండ్ వినిపిస్తూ..ఆందోళన చేస్తున్నారు నిజాం విద్యార్థులు.100 మంది విద్యార్థులు డిగ్రీ ఎక్జామ్స్ రాయకుండా ఎక్జామ్స్ సెంటర్ ముందు ధర్నా చేస్తున్నారు నిజాం విద్యార్థులు. 15 మంది ఎగ్జామ్ ఫీజులు కట్టించుకోకుండా , 1 సంవత్సరం డీటైన్ చేస్తే, సంవత్సరం నష్టపోతారని..వెంటనే నిజాం కాలేజీ యాజమాన్యం మార్చాలని ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు.