న్యూజెర్సీ (స్వాతి):

తెలుగు సినిమాకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు. తెలుగు రాజకీయాల్లో నిలువెత్తు శిఖరం. తెలుగు సినీ, రాజకీయాలను శాసించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు భౌతికంగా దూరమై 28 ఏళ్ళవుతున్న సందర్బంగా అమెరికాలోని ఎన్నారైలు ఘనంగా నివాళి అర్పించారు. యూబ్లడ్ యాప్ అధినేత డాక్టర్ జై యలమంచిలి ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి ఆన్‌లైన్ వేదికగా పాల్గొని ప్రసంగించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసాధారణ రీతిలో ఎదిగి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆమె అన్నారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు.

అమెరికాలోని ప్రముఖ డాక్టర్ డాక్టర్ నూరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ భార్య అనారోగ్యం కారణంగా అమెరికా వస్తే తాను చికిత్స చేశానని చెప్పారు. తాము మాత్రం అమెరికా వరకు వచ్చి చికిత్స చేసుకున్నామని అయితే సామాన్యుల పరిస్థితి ఏంటని అప్పుడే ఎన్టీఆర్ ఆలోచించి, తన భార్య పేరిట హైదరాబాదులో బసవతారకం హాస్పిటల్ నిర్మించారని ఈ సందర్భంగా డాక్టర్ నూరి తెలిపారు. ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని అన్నారు.

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో రాజేందర్ డిచ్‌పల్లి, ప్రదీప్ సాముల, నాగేశ్వర్ చెరుకుపల్లి, T.P రావు తదితరులు పాల్గొనగా, ఆన్‌లైన్ వేదికగా మన్నవ మోహన్ కృష్ణ, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగాఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. యుగపురుషులు అరుదుగా జన్మిస్తారని, అందులో ఎన్టీఆర్ ఒకరని అతిథులు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు గౌరవాన్ని నిలిపిన వ్యక్తిగా ఎన్టీఆర్ ను కీర్తించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమ నిర్వాహకులు జై యలమంచిలి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు వారి గుండెలో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. సినిమాలు ఉన్నంతకాలం.. రాజకీయాలు ఉన్నంతకాలం.. తారక రాముడి నామం చిరస్థాయిగా నిలిచే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ఎన్నారైలు పాల్గొని ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV


 

By admin