నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉండగా.. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పల్లా. మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
దీంతో 5వ సారి కూడా నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఈ సారి గెలుపు గుర్రానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి అనే విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పల్లె రవి కుమార్‌కి నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.
పల్లె రవికుమార్ వామపక్ష ఉద్యమ నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. సీనియర్ జర్నలిస్టుగా ఎన్నో సమస్యలపై గళం విప్పారు. తెలంగాణ మేధవులతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.
పల్లె రవి పోరాట స్పూర్తిని, అంకితభావాన్ని గమనించిన కేసీఆర్ ఆయనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా నియమించారు. ఐతే, ఆరు నెలలకే ప్రభుత్వం మారడంతో పల్లె రవికుమార్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయనపై పార్టీలో సానుభూతి ఉంది.
అంతేకాదు, నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో పల్లె రవికి మంచి పట్టు ఉంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ప్రతి మండలంలో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలతో, ముఖ్యంగా విద్యావంతులు, జర్నలిస్టులు, అడ్వకేట్లతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అన్నిటికి మించి ఈ మూడు జిల్లాల్లో గౌడ్ సామాజికవర్గం ఓట్లు అధికం. గెలుపు ఓటమిల్లో వీరి ఓట్లు ప్రభావితం చేస్తాయి.
బలమైన గౌడ సామాజికవర్గం ఓట్లు కొల్లగొట్టాలంటే ఆ సామాజికవర్గానికి చెందిన పల్లె రవికుమార్‌కు టికెట్ ఇస్తేనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ నియోజకవర్గంలో బీసీ ఓట్లు కూడా అధికమే. బీసీలు రవికి దన్నుగా నిలుస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో పల్లె రవి కుమార్ పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు.
సీనియర్ జర్నలిస్టుగా, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడిగా, బీసీ నాయకుడిగా, నల్గొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల్లో మంచి పట్టు ఉన్న పల్లె రవి కుమార్‌కు టికెట్ ఇస్తేనే గెలుపు సాధ్యమవుతుందని పలు సర్వేలు, విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వ్యూహాం ఎలా ఉండనుందనేదే ఇప్పుడు హాట్ టాపిక్.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://breakingnewstv.co.in/mobileapp/
BREAKINGNEWS TV
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r