• అభినందించిన‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య

ములుగు: 51వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని (ఆర్బివిపి) సైన్స్ ఫెయిర్ -2024 ప్రదర్శనకు ములుగు జిల్లా నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం విద్యార్థులు ఎంపిక అయ్యార‌ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొయ్యడ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిసెంబర్ నెల 25వ నుండి 31వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించబడే జాతీయస్థాయి సైన్స్ ఫేయిర్‌కు ములుగు జిల్లా జడ్పీహెచ్ఎస్ రామన్నగూడెం పాఠశాలలోని శ్యాంసుందర్ రెడ్డి బయోసైన్స్ ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గార రక్షిత, గార మైథిలి విద్యార్థులు తయారు చేసిన‌ “ఇంటలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్ “అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపిక చేశార‌ని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో విద్యార్థులను వారి గైడ్ టీచర్ శ్యాంసుందర్ రెడ్డిని, వారిని ప్రోత్సహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్యని డిఎన్ఆర్ ట్రస్ట్ అధ్య‌క్షులు ప్రతాపరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఎగ్జిబిట్ ఉన్నతీకరణకు, ప్రయాణ ఖర్చులకు ప్రతాప్ రెడ్డి రూ. 30 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అభినందించారు. కొయ్యడ మల్లయ్య డిఎన్ఆర్ ట్రస్ట్ ప్రతాప్ రెడ్డి ఔదార్యాన్ని, విద్యార్థులకు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈ సందర్భంగా ప్రతాప రెడ్డి మాట్లాడుతూ.. ఈ నూతన అధ్యాయం పాఠశాల విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడానికి, వారి సృజనాత్మకతను వెలికితీయడానికి ఒక ప్రేరణగా నిలుస్తుందని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. కొయ్యడ మల్లయ్య సంయుక్తంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులకు పాఠశాల అన్ని విధాలా సహకారం అందిస్తుందని, రక్షిత, మైథిలిల విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, వారు కూడా శాస్త్రీయ రంగంలో తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రోత్సహిస్తుందని కొనియాడారు. జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్ లో వారి ప్రదర్శనకు అభినంద‌న‌లు తెలుపుతూ, వారి ప్రాజెక్టు దేశానికి గొప్ప సేవ చేస్తుందని ప్రధానోపాధ్యాయులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక ఉన్న కృషిని గుర్తిస్తూ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, డిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత ప్రతాపరెడ్డికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం జెడ్పి హెచ్ఎస్ రామన్నగూడెం పాఠశాల పేరు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని అభిప్రాయపడ్డారు.

 

By admin