◉ సౌదీ ఎడారి నుంచి స్వదేశానికి చేరిన నిర్మల్ జిల్లావాసి

కువైట్ – సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ లతో పాటు గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్ తన కుటుంబ సభ్యులతో శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌ వెళ్లాడు. అరబ్బు యజమాని అతన్ని కువైట్‌ నుంచి అక్రమంగా సౌదీకి తరలించి ఒంటెల కాపరి పని చేయించాడు. యజమాని హింసను తట్టుకోలేకపోతున్నాను, నిత్యం నరకం అనుభవిస్తున్నాను, ఎడారి నుంచి నన్ను రక్షించండి అంటూ రాథోడ్ నాందేవ్ ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పంపిన ఒక సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ జీఏడీ ఎన్నారై శాఖ అధికారులు, అనిల్ ఈరవత్రి తో కలిసి కువైట్, సౌదీ అరేబియా రెండు దేశాల్లోని ఇండియన్ ఎంబసీలతో, అక్కడి సామాజిక సేవకులతో, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయము చేసి నాందేవ్ ను రక్షించి స్వదేశానికి వచ్చేలా చేశారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) బృందం కృషి అభినందనీయం.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *