ఓ అందమైన గ్రామం..
అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు..
కుల వృత్తులతో ఒకరికొకరు ఆప్యాయత పంచుకుంటున్న నేపథ్యం..
కల్మషం లేకుండా స్వచ్ఛంగా సాగుతోన్న సమయంలో ‘ఓ అలజడి’ ప్రవేశించింది..
గ్రామీణ ప్రజల ఆనందాన్ని అణిచివేసే ‘కుట్ర’ మొదలైంది..
ఓ సంస్థ తప్పు..
రాజకీయ అవసరం..
మోసగాళ్ల కుతంత్రాలు..
అన్నీ కలిసి ఆ స్వచ్ఛమైన ఊరును అల్లకల్లోలం చేసినయ్.
తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథ.. వారి నిత్య జీవన విధానం మనల్ని హాయిగా నవ్విస్తది.. ఆ స్వచ్ఛత మన మనసును దోచుకుంటది.. మన పల్లెను మళ్లీ మనకు గుర్తుకు తెస్తది.. అంతేకాదు చూస్తున్నంత సేపు ఆ గ్రామంలో ఉన్నట్టే అనిపిస్తది.. ఈ చిత్రంలోని పాత్రల స్వభావం, వారి మాటలు, వారి పనులు ఎంత సహజంగా ఉన్నాయో! కష్టమోస్తే మద్దతుగా నిలిచే ఊరి జనాలు ఉంటారు. అర్థం చేసుకోకుండా సూటిపోటి మాటలతో బాధపెట్టే మనుషులూ ఉంటారు. అలాంటి విషయాలను కళ్ల ముందు ఉంచింది ఈ సిన్మా. చదువురాని ఆ పల్లెటూరి అమాయకత్వంలో మంట పెడితే ఎలా ఉంటదో సూటిగా సూపెట్టింది. పల్లె జనాల జీవితాల్లో రాజకీయ కల్మషం ఎలా బుసులు కొడతదో కూడా సూపెట్టింది ఈ సిన్మా. పల్లె కన్నీరు పెట్టిన విధానం ప్రతి ప్రేక్షకుడికి కంటతడి పెట్టిస్తది. ఆనందపరుస్తది.. ఆవేశపరుస్తది.. ఆందోళనపరుస్తది.. చివరికి మనుసును తేలికపరుస్తది.. ఒక మంచి ఫీల్‌ని గుండెల నిండా నింపుతది ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచీ’ సిన్మా.
సిన్మాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటది. ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన ‘బలగం’ కూడా ఒక ఉదాహరణ. ఈ తెలంగాణ నేపథ్య ‘భీమదేవరపల్లి బ్రాంచీ’ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కళ్లకు నచ్చుతది. మన మనసును తాకుతది..
ఏబి సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న, బుర్ర శ్రీనివాస్ నటీనటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా ‘భీమదేవరపల్లి బ్రాంచీ’. విడుదల అయి థియేటర్ లో సందడి చేస్తోంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరం చూద్దాం. మన మట్టి వాసన పరిమళాలను ఆస్వాదిద్దాం.
ఈ చిత్ర యూనిట్ అందరికి అభినందనలు, శుభాకాంక్షలు..💐💐
– స్వామి ముద్దం
CEO, MediaBoss Network
***
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews