మహోధృతంగా హృదయపూర్వకంగా పుష్పించాలి.

“కల్లు”….!! నేటి సామాన్య జీవులకు, వృత్తి నైపుణ్య విధాతలకు అడుగుజనం కోణం నుంచి చూస్తే ఆర్థిక జీవన విధానం సమ్మతం అనిపించదు.

“కల్లు”….!! వ్యాపారం, గౌండ్ల కులస్తుల్లో ప్రభువులు, పెత్తందార్లు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు, ధనికుల కోణం నుంచి చూస్తే సంపాదన సమ్మతంగానే ఉంటుంది.

“నీరా” ఓ బ్రేకప్
రూటు మారనున్న కల్లు.. నీరా’గా పునరుజ్జీవనం.

ఓటమి రాజ్యం వేసే కల్లును ఆబ్కారీ బందీ సంకేళ్ళకు ‘నీరా’తో విముక్తి.

గీత వృత్తి అనే పట్టింపు లేని ఒంటరి జీవితాలకు “నీరా”తో పునరుత్తేజం.

కల్లు నుండి నీరా’గా వస్తే ఏం లాభం.? ఎవరికి లాభం.? మళ్లీ సంపన్నుల కనుసన్నల్లో ఉంటుందనే అనుమానానికి నివృత్తి నా వివరణ….!

ఎలా…?

భారతదేశం సామ్రాజ్యవాద కనుసన్నల్లో ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) రంగ ప్రవేశం చేసిన తర్వాత గ్రామీణ జీవన మనుగడ దెబ్బతిని కుల వృత్తులు కనుమరుగయ్యి, కార్పోరేట్ శక్తులు హస్తగతం చేసుకుని రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో…

ఓన్లీ గీత వృత్తి ఒక్కదాన్ని ముట్టలేక పోయారు. ఎందుకు.? ఏ వృత్తి నైనా ఆర్టిఫిసియల్ హోల్డింగ్, మోల్డింగ్ చేయొచ్చు. కానీ గీత వృత్తి ద్వారా వచ్చే ప్రకృతి పానీయం ఆర్టిఫిసియల్ చేయరాదు. నిజంగా ఆ అవకాశం ఉంటే అంబానీ, ఆదానీ, టాటా, బీర్ల ఇంకా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తే భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ చెట్లు పెంచడానికి ఒక్కో కంపెనీకి లక్షల ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఇచ్చేవారు. కానీ పెట్టుబడి వ్యవస్థ గీత వృత్తిని గుంజుకోలేక పోయింది. వాళ్ళకు కావాల్సింది ప్రతి సెకనుకు పైసలు పుట్టే విధానం కావాలి. కంపెనీ యాజమాన్యం కింద కార్మికులు ఉండాలి. అజమాయిషీ వ్యవస్థ కంపెనీ విధానం.

మరి నీరా వ్యవస్థలోకి ఎందుకు రాలేరు అంటే ప్రభుత్వాలు భూమి లక్షల ఎకరాలు ఇచ్చినా చెట్లు పెంచి 5 సంవత్సరాలు కాపాడి, ఆ తర్వాత గీత వృత్తి ద్వారా సేకరణ చేయాలి. ఇక్కడ గీత వృత్తి మీద ఆధారపడి కంపెనీ యాజమాన్యం నడవాలి. గీత వృత్తి దారులకు ఏం ఇబ్బంది చేసినా చెట్లను చంపే టెక్నాలజీ తెలిసిన సైంటిస్టులు. నీరా ఎట్ల తీయాలో.. తేడా వస్తే చెట్లను చంపి కంపెనీల ఎట్లా మూతపడాలో తెలిసినోళ్ళు, వృత్తి నిపుణులు..!

ఒక్క చెట్టు చనిపోతే 5 సంవత్సరాలు ఎదిరి చూడాలి. అంటే ఇక్కడ పెట్టుబడిదారుడు గీత వృత్తి దారుల ఆధీనంలో పనిచేయాలి. అంటే యాజమాన్యం బాంచెన్ గా బతకాలి. మళ్లీ ఇంకో విషయం:- నీరా అంటేనే చెట్టు నుంచి పుట్టే ప్రకృతి సహజ సిద్ధమైన పోషక ఔషధ గుణాల సమ్మేళనం. దీనిని ఆర్టిఫిసియల్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఆర్టిఫిసియల్ చేసిన పండ్ల రసాలను, కూల్ డ్రింక్స్ ను చూడొచ్చు. ప్రిజర్వెటర్ అనే రసాయనం కలిపి అవి నిలువ చేస్తారు. కానీ నీరా’లో పోషక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి అలా కలపడానికి వీలుండదు. ఒకవేళ కలిపితే అవన్నీ చనిపోయి దాహం తీర్చే కూల్ డ్రింక్స్ గా మాత్రమే ఉంటుంది. అప్పుడు దానిని నీరా అని పిలువడానికి వీలుండదు.

నీరా అంటున్నారు మరి సంపన్నుల చేతుల్లోకి పోయి కల్లు ముస్తేదార్ వ్యవస్థ వస్తదనే అనుమానం.?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరా హక్కు ఓన్లీ గౌడ సామాజిక వర్గం హక్కు చట్టం కాబడింది. భారత దేశంలో ఎక్కడా లేని ప్రత్యేక జీవో తెచ్చింది. దీని వల్ల గీత వృత్తి శాశ్వత పరిష్కారం అంది, ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం ఉంది.

అయ్యో… నీరా ప్రాసెసింగ్ యూనిట్లు, నీరా స్టాల్లు మళ్ళీ సంపన్నుల చేతుల్లోకి పోయి పాత ముస్తేదార్ వ్యవస్థగా మారుతుందనే అనుమానం అవసరం లేదు.

ఇక్కడ గీత వృత్తి దారుడే హీరో…!!! నీరా సృష్టికర్తనే కేంద్రం..! కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిన, స్టాల్ పెట్టిన గీత వృత్తి దగ్గర కొని అమ్ముకునే వాళ్ళే..

ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి వృత్తి దారుల నుంచి నీరా సేకరణ చేసి దాంట్లో ఉండే ఈస్ట్ అనేదాన్ని చంపి బాటిల్ సిల్ చేసి నిల్వ విధానం ద్వారా అమ్మబడును. అంటే ఎంత పెద్ద యూనిట్ పెట్టిన వృత్తి దారుల నుంచి సేకరించాల్సిందే.

మరి గీత వృత్తికి లాభం ఎలా ఉంటుంది.?

ఉదా:- ఈత కానీ ఖర్జూర చెట్లు తీసుకుందాం. ఒక వృత్తి దారుడు రోజు కనీసం 15 చెట్లు గీత గీయగలడు. ఒక్కో చెట్టు నుంచి కనీసం 3 లీటర్ల నీరా రాగలదు.

ఈరోజు వృత్తి దారులు తాగే వాళ్ళను బట్టి గీత గీయాల్సిన పరిస్థితి. మిగిలినది పారపోసి పోవాల్సిందే. కుదేలైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న గౌండ్ల కులంలోనే పేదరికం అనుభవిస్తున్న నిరుపేద గీత వృత్తి దారుడే.

అదే నీరా వస్తే ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశం ఇస్తే.. ప్రతి ఊర్లో సేకరణ సెంటర్ పెట్టి తీసుకెళ్తారు. కాబట్టి 15 చెట్లు గీసి సెంటర్లో పోస్తే వృత్తి దారులకు ఆర్థిక అభివృద్ధి దిశగా వెసులుబాటు ఎలా ఉంటుందంటే…..!!!

ఒక మనిషి సంపాదన లెక్కల్లో..!

15 చెట్లు గీస్తే 45 లీటర్లు. వీటిని సెంటర్ కు పోస్తే వచ్చే ఇంకమ్. లీటరుకు కనీస ధర 100 రూపాయలు అనుకుందాం.

45 లీటర్లు × 100 రూ = 4,500 రోజు సంపాదన

4,500 × 30 రోజులు= 1,35,000 నెల సంపాదన.

అంటే నీరా ద్వారా ఆర్థిక అభివృద్ధి ఒక్క మనిషి లక్ష 35 వేలు అంటే సాయంత్రం గీసి ఉదయం సెంటర్లో పోస్తే వచ్చే ఇంకమ్. ఇప్పుడు ఏం చేస్తడంటే తన భార్యకు పిల్లలుకు వృత్తి నేర్పించి వారి నుంచి కూడా ఇంకమ్ పెంచుకుంటాడు.

ఉదా:- భార్య భర్తలు ఇద్దరు పిల్లలు అనుకుందాం. ఒక్కొక్కరు లక్ష 35 వేలు అంటే కుటుంబం మొత్తం ఆదాయం
1,35,000 × 4 = 5,40,000 నెల సంపాదన అంటే ఇటు ఆర్థిక అభివృద్ధి, అటు కనుమరుగయ్యే వృత్తికి పునరుజ్జీవనం పోసి వృత్తి దారుల సంఖ్య పెరిగి ఆర్థిక వ్యవస్థ పెరిగే అవకాశం గీత వృత్తికి ఉంది. కాబట్టి స్వంత భూముల్లో చెట్లు పెట్టే వ్యవసాయంగా మారి స్వయం ఉపాధికి కేంద్రంగా నీరా పాలసీ కాగలదు.

ఇక్కడ ముస్తేదార్ ది నడువదు. వృత్తి దారుందే నడుస్తది. ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు నీరా సేకరించి శాస్త్రీయంగా చెడిపోకుండా నిల్వ ఉంచే విధానంతో పాటు ఇతర ఉత్పత్తులు మాడ్రనైజ్ చేసి నీరా స్టాల్ లలో అమ్ముకుంటారు. స్టాల్లు, ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతుంది.

ఇక్కడ గీత వృత్తి దారులే ప్రధాన కేంద్రం..!! కంపెనీల మీద వృత్తి దారుడు ఆధారపడడు. గీత వృత్తి పైనే కంపెనీలు ఆధారపడాలి. అందుకే కార్పోరేట్ శక్తులు రాలేకపోయారు.

రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది
“ఈతముల్లు ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్” డాక్టర్ నీరా బైప్రొడక్ట్ ప్రొడ్యూసింగ్ డెవలప్మెంట్ యూనిట్.

  • ఈతముల్లు 

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php 

By admin