మల్లాపూర్ (అరుణ్ – న్యూస్ ప్రతినిధి): జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. మాజీ సర్పంచ్ గోపిడి రాజారెడ్డి స్మారకంగా గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఈ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిర కార్యక్రమంలో మల్లాపూర్ చెందిన 318 మంది సద్వినియోగంపరుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్య సిబ్బంది డాక్టర్స్ మదన్, డాక్టర్ ఖాతిజ, డాక్టర్ రమేష్ డెంటల్, మార్కెటింగ్ ఇంచార్జి లింగంపల్లి ప్రణీత్, మెడికవర్ సిబ్బంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గోపిడి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదములు తెలిపారు. మల్లాపూర్ గ్రామ ప్రజలకు మరెన్నో సేవలు అందించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను తెలిపారు.

 

By admin