పుడమైనవ్
మొక్కైనవ్
మానైనవ్
పిందెనైనవ్
కాయవైనవ్
పండైనవ్
పరుపైనవ్
పరిహాసమైనవ్
పరిపరివిధాల ఆలోచనవైనవ్
పరితాపమైనవ్
పరిక్రమవైనవ్
ప్రతాపమైనవ్
ప్రశాంతతవైనవ్
అప్రశాతంతవూ అయినవ్
అలజడైనవ్
అబలవైనవ్
సబలవైనవ్
రెబలవైనవ్
రాణివైనవ్
దాసివైనవ్
ప్రేయసివైనవ్
ప్రణయమైనవ్
ప్రళయమైనవ్
పరిణయమైనవ్
పరిణితివైనవ్
తల్లివై.. చెల్లివై.. అక్కవై..
పిన్నివై.. పెద్దమ్మవై.. అమ్మమ్మవై.. బామ్మవై..
ఎన్నెన్నో
బంధానుబంధాలతో అనుబంధాలవైవనవ్
కానీ ఇంకా నువ్వు మహిళవే అవుతున్నవ్
పురుషాధిక్య బాహుబంధాల మధ్య చిక్కి శల్యమవుతున్నవ్
వాడు కాల్చిన సిగెరట్ పీకనార్పడానికి పనికొచ్చే యాష్ ట్రేవవుతున్నవ్
వాడి కోపతాపాలను తీర్చడానికి ఉపయోగించే పడకగదివవుతున్నావ్
వాడి పైత్యమంతా రంగరించడానికొక కవితవవుతున్నవ్…
వాడికన్నీ నువ్వే అవుతూ కూడా నువ్వు నువ్వుగానే మిగిలిపోతున్నవ్
నీటి మీద నూనె మచ్చలా తేలిపోతున్నవేందే
నువ్వు మహిళవా?
నువ్వు కేవలం స్త్రీవా??
నువ్వు కేవలం లలనవా???
లాలించి పాలించి పెంచి పెద్ద చేసిన
ఈ ప్రపంచానికి నువ్వు అంతకన్నా మించి మరేం కావా
నీ నుంచి పుట్టినోడు నిన్ను పుట్టెడు దుఃఖంలో ముంచెత్తుతుంటే.. దాన్నింకా దిగమింగుకుంటూనే ఉన్నావా!!!
రా
నువ్వు నీలా రా…..
నీలోనిదే ఇదంతా
ఎక్కువ సేపు దీన్ని భరించి..
నీ బాధను నీ పంటికింద అదిమి పట్టకు
పట్టుకు పో..
నిన్ను దుఃఖపెట్టేదేనికీ ఇక్కడ తావులేదు
తుదముట్టించి పో…………
నీకోసం
నీ సుఖసంతోషాలకోసం మాత్రమే
మిగిలి ఉండేదాన్నొదిలి..
మిగిలినదాన్నంతా మింగెయ్..
ఈ మలినం ఈ ప్రపంచానికేం అవసరం లేదు..
మొత్తం ఊడ్చుకుపో…..
నిన్ను నిన్నుగా చూడగలిగేది మాత్రమే
నీ కనుసన్నల్లో నడిచేది మాత్రమే
ఇక్కడుండేలా చూడు..
అదే నీవు సృజించిన ఈ జగతికి మేలు
మిగిలినదంతా కీడే..
ఈడ్చేయ్………….-‘ఆది’పర్వం
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
—————————-
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews