హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిలభారత విద్యార్థి పరిషత్ నేతలు, విద్యార్థులు కదం తొక్కారు. దగాపడ్డా తెలంగాణ విద్యార్థి మార్పు కోసం మరో ఉద్యమం అంటూ పరేడ్ గ్రౌండ్‎లో కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కేసీఆర్ సర్కార్‎ను గద్దె దించడమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తుందని.. విద్యార్థుల సమస్యలపై పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఏబీవీపీ ఆర్గనైజేషనల్ జాతీయ సెక్రటరీ ఆశీష్ చౌహాన్, జాతీయ జాయింట్ సెక్రటరీ బాలకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి యాజ్ఞవల్క్య శుక్లా సహా పలువురు ప్రముఖులు ఈ సభకు హాజరయ్యారు. బీజేపీ నేతలు మురళిధర్ రావు, మనోహర్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువులు ఈ సభకు హాజరయ్యారు. పదేళ్లలో తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని కుటుంబ ప్రగతిని మాత్రమే సాధించారని ఏబీవీపీ ఆర్గనైజేషనల్ జాతీయ సెక్రటరీ ఆశీష్ చౌహాన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస టాయిలెట్లు లేని దుస్థితి ఉందని.. అధ్యాపకుల నియామకం ఎందుకు చేపట్టట్లేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణను దోచుకున్న కేసీఆర్.. ఇప్పుడు దేశం మీద పడబోతున్నారని.. కేసీఆర్ పతనం ఈ సభతోనే ఆరంభం అంటు ఆశిష్ మండిపడ్డారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ల పోస్టుల భర్తీ వెంటనే చేపట్టాలని ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలకు అద్దం పట్టేలా పెద్దఎత్తున తరలివచ్చిన విద్యార్థులే అందుకు నిదర్శనం అన్నారు. లీకేజీ సర్కారు వెంటనే TSPSCని ప్రక్షాళన చేసి లక్షా 91 వేల ఉద్యోగాలను ఫిల్ చేయాలని అన్నారు. బకాయిపడ్డ విద్యార్థులు మెస్ ఛార్జీలు, ఫీజు రీయింబర్స్‎మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాలయాలను సమస్యల నిలయంగా మారిన ఈ సర్కారు అవసరం లేదని.. విద్యార్థుల పక్షానా ఉండే ప్రభుత్వాన్ని స్థాపించాలని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శుక్లా పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నయని.. తెలంగాణలో మాత్రం అవినీతి రాజ్యం ఏలుతుందని అన్నారు. తెలంగాణ విద్యార్థి లోకం కేసీఆర్ తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు.

ఈ నేప‌థ్యంలో ప్రవాస భారతీయులు అమెరికా నుంచి పూర్వ విద్యార్థులు ఏబీవీపీ కదనభేరీకి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపారు. విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల, శ్రీనివాస్ కొంపల్లి, సంతోష్ రెడ్డి, బుచ్చన్న గాజుల, నరేందర్ గౌడ్ దోసపాటి, బాలవర్ధన్, ఆదిత్య రాయుడు, భరత్ గోలి, రామకృష్ణ, రఘువీర్, రామ్ వేముల, ప్రదీప్ కట్ట పూర్తి మద్దతు తెలిపారు.

#ABVP

 

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

  • https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

By admin