▪️ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఉద్యమకారుడు కుక్క మల్లయ్య
▪️పరామర్శించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

హైద‌రాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పని చేసి ఆర్థికంగా నష్టపోయి ఆవేదన తో కరీంనగర్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఉద్యమకారుడు కుక్క మల్లయ్య గారిని హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పరామర్శించారు. ఉద్యమకారులు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే దైర్యంగా ఉండాలని కష్టాలలో అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చి సీనియర్ నాయకులు నెర్డం భాస్కర్ గౌడ్, డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఉద్యమకారులను BRS ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల నిజాయితీగా కష్టపడ్డ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇకనైనా BRS సర్కార్ ఉద్యమకారుల బాధలు అర్దం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారుల ఆత్మగౌరవ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర నాయకులు చీమ శ్రీనివాస్ గారు, నేర్దం భాస్కర్ గౌడ్ గారు, కార్యదర్శి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పరీదుల శ్రీనివాస్ గౌడ్, K వీరాస్వామి, రాష్ట్ర కో కన్వీనర్ నర్రా సంపత్ పాల్గొన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin