◉ ఖైదీల విడుదల కోసం భారత రాయబారికి సీఎం కేసీఆర్ లేఖ

◉ దుబాయి జైలు నుంచి హైదరాబాద్ జైలుకు బదిలీ ప్రయత్నాలు

నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మేరకు దుబాయి లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ (భారత రాయబారి) ఒక లేఖ రాశారు. మంత్రి కె. తారక రామారావు అమెరికా నుంచి హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో మంగళవారం (05.09.2023) నాడు దుబాయిలో ఆగారు. ఇండియన్ కాన్సులేట్ అధికారులు, యూఏఈ జాతీయుడైన న్యాయవాది సల్మాన్ సబ్రి, సోషల్ వర్కర్స్ తో మంత్రి కేటీఆర్ సమావేశమై ఖైదీల విడుదలకు గల అవకాశాలపై చర్చించారు.

ఆరు నెలల క్రితం మంత్రి కేటీఆర్ తన కార్యాలయ అధికారులను, తెలంగాణ ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ను దుబాయి పంపించారు. అధికారుల బృందం దుబాయి ఇండియన్ కాన్సులేట్ అధికారుల సాయంతో దుబాయి లోని అల్ అవీర్ జైలును సందర్శించారు. అరబ్ లాయర్ కు కావలసిన ఫీజును దాతలతో ఇప్పించారు.

సిరిసిల్ల మండలం పెద్దూరు కు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి అనే ఇద్దరు అన్నదమ్ములు, చందుర్తి కి చెందిన నాంపెల్లి  వెంకటి (గొల్లెం నాంపెల్లి), కొనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మన్, మల్యాల మండలం మానాల కు చెందిన శివరాత్రి హన్మంతు అనే అయిదుగురు జీవిత ఖైదు (24 ఏళ్ల) శిక్ష పడి దుబాయి లోని అల్ అవీర్ సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు. వీరందరూ ‘ఖల్లివెల్లి’ (వీసా గడువు ముగిసిన అక్రమ నివాసులు) కార్మికులే. ఇదే కేసులో శిక్ష పడిన కొడిమ్యాల మండల నమిలికొండ (తురుకకాశీ నగర్) కు చెందిన సయ్యద్ కరీం ఎనిమిదేళ్ల క్రితం విడుదలయ్యాడు. నలుగురు పాకిస్తానీలు అంతకు ముందే విడుదలయ్యారు.

నేపాల్ లో ఉన్న మృతుడి కుటుంబానికి ‘దియా’ (బ్లడ్ మనీ) చెల్లించి ‘క్షమాభిక్ష’ పత్రం దుబాయి కోర్టులో దాఖలు చేస్తే ఖైదీల విడుదలకు మార్గం సుగమం అవుతందనే న్యాయవాది సూచనతో 2012 లో ఖైదీల కుటుంబ సభ్యులు నిధుల సమీకరణకు ప్రయత్నాలు ప్రారంభించారు. బండలు కొట్టి జీవించే వడ్డెర కుటుంబాలకు చెందిన వీరికి లక్షలాది రూపాయల నిధుల సమీకరణ అసాధ్యం అయ్యింది. నిధుల సమీకరణకు తమ కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని దుబాయి జైల్లో మగ్గుతున్న ఆరుగురు ఖైదీల భార్యలు గల్ఫ్ కార్మిక నాయకులు పి.నారాయణ స్వామి, మంద భీంరెడ్డి ల నాయకత్వంలో హైదరాబాద్ లోని మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. ఈ విషయం తెలిసిన వెంకట సాయి మీడియా, హాత్ వే కమ్యూనికేషన్స్ అధినేత సిహెచ్. రాజశేఖర్ రూ.15 లక్షల చెక్కును విరాళంగా ఇచ్చారు.

2013 లో అప్పటి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్, గల్ఫ్ కార్మిక నాయకులు పి. నారాయణ స్వామి, మంద భీంరెడ్డి నేపాల్ కు వెళ్లి మృతుడు దిల్ ప్రసాద్ రాయ్ భార్య దిల్ కుమారి రాయ్ కు రూ.15 లక్షల చెక్కు ఇచ్చి ఆమె నుంచి ‘క్షమాభిక్ష’  పత్రం తీసుకున్నారు. కేసులో ఉన్న సంక్లిష్ట కారణంగా వీరి క్షమాభిక్ష పిటిషన్ ను పై కోర్టు రెండు సార్లు తిరస్కరించింది. నేపాల్ పౌరుడి మృతి అనుకోకుండా జరిగిందని, కావాలని చేసింది కాదని, అరబిక్ భాష రాకపోవడంతో తమ కేసును సరిగా వాదించుకోలేకపోవడం, గత 15 ఏళ్లుగా సత్ప్రవర్తన కలిగి ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకొని రాయల్ కోర్టు (రాజు గారి దర్బార్) క్షమాభిక్ష ప్రసాదించేలా దౌత్యపరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న జరిగిన ఖైదీల బదిలీ ఒప్పందం ప్రకారం దుబాయి జైలు నుంచి హైదరాబాద్ జైలుకు బదిలీ చేసి మిగతా శిక్షాకాలం ఇక్కడ గడిపే అవకాశం కూడా ఉన్నది.

2005 నుంచి చాలా మంది సామాజిక కార్యకర్తలు వీరి విడుదలకు ప్రయత్నించారు. దుబాయి లోని న్యాయవాది అనురాధ, హైదరాబాద్ హైకోర్టు న్యాయవాది పి. శశి కిరణ్, సిరిసిల్లకు చెందిన కె.కె. మహేందర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎన్నారై సెల్ చైర్మన్ వెంకట్ మేడపాటి, సిరిసిల్ల జర్నలిస్టులు తడుక నాగభూషణం, బాలు కాయితి, దుబాయి లోని సోషల్ వర్కర్స్ వై. శ్రీనివాస శర్మ, జువ్వాడి శ్రీనివాస రావు, సలావుద్దీన్ ల బృందం పని చేసింది. నేపాల్ లోని మృతుని కుటుంబ సభ్యులతో అనుసంధానం చేయడానికి మైగ్రెంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఏ) సభ్యులు బిష్ణు బి ఖత్రి లు ప్రత్యేకంగా కృషి చేశారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin