ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక ‘ఆదిపురుష్’ సందడి మొదలైపోయింది. యూఎస్ లో ప్రదర్శించనున్న ప్రీమియర్ షోలు మిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా కంటే ముందే యుఎస్‌లో ‘ఆదిపురుష్’ ప్రీమియర్లని ప్రదర్శించడం ఆశ్చర్యపర్చే అంశమే. తెలుగుయేతర పంపిణీదారు ఏఎంసి స్టబ్స్ ఈ ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తోంది. భారతదేశంలో విడుదలకి ఒక రోజు ముందు అంటే ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ లో ప్రీమియర్స్ ని ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసింది. తెలుగేతర డిస్ట్రిబ్యూటర్ల ఈ అనూహ్య చర్య చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా, సినిమా రన్ ముగిసే సమయానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ సందర్భంలో, డిస్ట్రిబ్యూటర్లు ఒక పెద్ద తెలుగు స్టార్ సినిమాకోసం సాహసోపేతమైన ఈ చర్య తీసుకున్నారు.
ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ నటించడం, రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా కావడం, ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక కథలు బాగా ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఇందులో రాముడిగా నటించారు. ఆయనకు జోడీగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై భారీ హైప్‌ని పెంచింది. ట్రైలర్, ఫైనల్ ట్రైలర్లు సైతం సినిమాపై అంచనాలను పెంచాయి. ఆడియెన్స్ లో ఆశలు కల్పించాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ క్రిటిక్స్, సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పిలవబడే ఉమైర్ సంధు తాజాగా ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు. అత్యంత కాంట్రవర్షియల్ క్రిటిక్‌గా పేరుతెచ్చుకున్న ఉమైర్ సంధు చెప్పినవాటిలో చాలా వరకు అబద్దాలు, అవాస్తవాలుగానే ఉంటాయి. దీంతో ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన `ఆదిపురుష్`పై తన రివ్యూ ఇచ్చాడు.
సినిమాపై ఉమైర్ సంధు పూర్తిగా నెగటివ్ రివ్యూ ఇచ్చాడు. సినిమా మొత్తం భారీ అని చెబుతూనే, అందులో సోల్ లేదని, ప్రభాస్ యాక్టింగ్ క్లాసులు తీసుకోవాలంటూ పెద్ద షాకిచ్చాడు. `ఆదిపురుష్` పెద్ద స్టార్స్, పెద్ద కన్వాస్, భారీ బడ్జె్, వీఎఫ్‌ఎక్స్, భారీ అంచనాల నేపథ్యంలో ఇది భారీ సినిమా, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇది పెద్ద పెద్ద నిరాశని కలిగిస్తుంది. సినిమాకి సోల్ లేదు, నటీనటులందరి చెత్త ప్రదర్శన చేశారు, ప్రభాస్ మీకు యాక్టింగ్ క్లాసులు కావాలి` అంటూ బాంబ్ పేల్చాడు. అంతేకాదు `ఆదిపురుష్` పెద్ద టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్‌లకు బాక్సాఫీసు వద్ద బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుందని పేర్కొన్నాడు. సినిమాకి రెండు రేటింగ్ ఇచ్చాడు.
దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌ని యాక్టింగ్ గురించి మాట్లాడతావా? చత్రపతి, చక్రం వంటి సినిమాల సమయంలో నువ్వు ఎక్కడున్నావ్ రా బచ్చా, నువ్వు నెగటివ్ రివ్యూ ఇచ్చావంటే సినిమా బ్లాక్ బస్టరే అని అంటున్నారు. నిన్ను ఎవరూ నమ్మరు, నువ్వు ఒక ఫేక్, నీ ట్వీట్లు అంతకంటే ఫేక్ అంటూ అతనిపై ఫైర్ అవుతున్నారు. బూతులతో విరుచుకుపడుతున్నారు.
నిజానికి ఉమైర్‌సంధు ఇలాంటి రివ్యూలు చాలా పెద్ద సినిమాలకు ఇచ్చారు. కానీ 90శాతం అతను చెప్పింది రివర్స్ అయ్యింది. పైగా అతను చాలా వరకు నెగటివ్ రివ్యూలిస్తుంటారు. దీంతో ఇతన్ని ఎవరూ నమ్మడం లేదు. కాకపోతే కాంట్రవర్షియల్‌ట్వీట్లతో తరచూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటాడు. వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తూ విమర్శల పాలవుతుంటాడు. ఇక `ఆదిపురుష్` సినిమా ఈ నెల 16న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. దాదాపు 6వేలకుపైగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. 3డీలో కాకుండా 2డీలో దీన్ని తీసుకురాబోతున్నారని సమాచారం.
ఈ క్రమంలో ఈ సినిమా గురించిన ఫస్ట్ రివ్యూ ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది. “ఆదిపురుష్ అనేది విజువల్‌గా అత్యద్భుతమైన & అటువంటి ఆకర్షణీయమైన చిత్రం, ఇది చూస్తున్నప్పుడు మనం నిజంగా ఆ దివ్య యుగంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత మనకు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.” అని ఈ ట్వీట్ లో రాసుకొచ్చారు.
మరోవైపు, ఇది పైడ్ రివ్యూ అని అంటున్నా.. ఆదిపురుష్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్న చాలా మంది ఈ ట్వీట్ ను చూసి సంతోషిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక ‘ఆదిపురుష్’ బాక్సాఫీసు మంచి ఊపులో వుంది. యూఎస్ లో ప్రదర్శించనున్న ప్రీమియర్ షోలు మిలియన్ డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇండియా కంటే ముందే యుఎస్‌లో ‘ఆదిపురుష్’ ప్రీమియర్లని ప్రదర్శించడం ఆశ్చర్యపర్చే అంశమే. తెలుగుయేతర పంపిణీదారు ఏఎంసి స్టబ్స్ ఈ ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తోంది. భారతదేశంలో విడుదలకి ఒక రోజు ముందు అంటే ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ లో ప్రీమియర్స్‌ని ప్రదర్శించడానికి రంగం సిద్ధం చేసింది. తెలుగేతర డిస్ట్రిబ్యూటర్ల ఈ అనూహ్య చర్య చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా, సినిమా రన్ ముగిసే సమయానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ సందర్భంలో, డిస్ట్రిబ్యూటర్లు ఒక పెద్ద తెలుగు స్టార్ సినిమాకోసం సాహసోపేతమైన ఈ చర్య తీసుకున్నారు. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సాధారణంగా పెద్ద స్టార్ సినిమాల కోసం ముందస్తు ఖర్చుల్ని, వడ్డీ భారాన్నీ ఎదుర్కొన్నప్పుడు సినిమా రన్ తరువాతి దశల కోసం ఇలాంటి ఆఫర్స్ ని రిజర్వ్ చేస్తారు. అయితే, ఉత్తర అమెరికాలోని ‘ఆదిపురుష్’ పంపిణీదారు ఏఏ ఫిల్మ్స్, వైవా ఎంటర్‌టైన్మెంట్స్ తో కలిసి ఈ అసాధారణ చర్యని చేపట్టింది.
ఏఎంసి అంటే అమెరికా మల్టీ సినిమా థియేటర్ గ్రూపు. 2016 లో ఈ గ్రూపు ఒక స్కీము ప్రారంభించింది. దీని ప్రకారం ఏ- లిస్ట్ సభ్యులుగా చేరిన వారు నెలకు 20 డాలర్లు చెల్లిస్తారు. దీంతో అందుబాటులో వున్న ప్రతి షో టైమ్‌లో, ప్రతి ఏఎంసీ లొకేషన్‌లో, ఏఎంసీలో ఐమాక్స్ సినిమా, ఏఎంసీలో డాల్బీ సినిమా, ఏఎంసీ లో రియల్ త్రీడీ సినిమా, ప్రైమ్‌లో రియల్ త్రీడీ సినిమా సహా ప్రతి ఫార్మాట్‌లో వారానికి గరిష్టంగా మూడు సినిమాల్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ సభ్యులకే అదనపు రుసుము లేకుండా ఈ రోజు ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ చూసే సౌకర్యం కల్పించారు! ఇందుకే ఇది ఆశ్చర్య పర్చే చర్య అయింది. ఇదిగాక ఏఎంసీ థియేటర్స్ వెబ్సైట్ లో సినిమాల లిస్టులో, ‘ఆదిపురుష్’ ప్రీమియర్స్ తర్వాత షోలకు అడ్వాన్స్ టికెట్స్ ఆప్షన్ ఎలాగూ వుంది. ‘ఆదిపురుష్’ ఇప్పటికే వివిధ ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్సు బుకింగ్స్ లో అద్భుత పనితనం చూపిస్తోంది. ఒక్క యూఎస్ లో బుధవారం ఉదయం నాటికి 490,000 డాలర్లు (సుమారు రూ. 4.10 కోట్లు) వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో 150,000 డాలర్లు (సుమారు రూ. 83 లక్షలు) కి చేరుకుంది. బ్రిటన్ లో 55,000 పౌండ్లు (రూ. 50 లక్షలు), కెనడాలో 30,000 డాలర్లు ( రూ. 25 లక్షలు) విలువైన టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. ఇక యూరప్ లో, ఆగ్నేయాసియాలో రూ. 40 లక్షలకి పైగా అమ్మకాలు జరిగాయి.
బేబీ మూవీ రిలీజ్ డేట్ లాక్ ‘ఆదిపురుష్’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 6 కోట్లు దాటాయి, విడుదల రోజు నాటికి ఈ మొత్తం రూ. 10 కోట్లకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఏఎంసీ ని పక్కన బెడితే, యూఎస్ ప్రీమియర్ షోలు ఒక్కటే సినిమా బాక్సాఫీసు విజయానికి గణనీయంగా దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రీమియర్ షోలు మిలియన్ డాలర్లు ( రూ. 8 కోట్లు) వసూలు చేయవచ్చని భావిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’ లో ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్ నాగే ప్రధాన పాత్రల్లో నటించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదీని ప్రకటించడంతో ‘ఆదిపురుష్’ చుట్టూ వున్న సందడి ఇంతా అంతా కాదు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘ఆదిపురుష్’ అత్యంత ఖరీదైన ధరతో టికెట్స్ ని అమ్మకానికి పెట్టారు. బుక్ మై షో ప్రకారం, పీవీఆర్ డైరెక్టర్స్ కట్, యాంబియన్స్ మాల్‌లో టికెట్ ధర అక్షరాలా రెండు వేల 200 రూపాయలు! ‘ఆదిపురుష్’ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న అసాధారణ నిర్ణయం ఒకవైపు ఉత్సాహాన్ని పెంచుతోంది. అయితే ఈ సాహసోపేతమైన నిర్ణయం ఫలిస్తుందా లేదా అన్నది కాలమే చెప్తుంది.