”ఆగ‌మ‌నం.. ఆధ‌ర్మ విధ్వంసం..” అంటూ ఆదిపురుష్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్‌ల‌లోకి వ‌చ్చేశాడు. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత కథను తెరకెక్కించారు. సీతారామ (ప్రభాస్, కృతిసనన్), లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది. అయితే తాను వివాహితుడినని శ్రీరాముడు శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు. దాంతో సీతపై హత్యా ప్రయత్నం చేయబోయిన శూర్ఫణఖ ముక్కును కోసేస్తాడు. తన చెల్లిలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రావణుడు సీతను అపహరిస్తాడు. లంకలో బంధించి త‌న‌తో పెళ్లాడమని వేధిస్తుంటాడు. సీతా అపహరణ తర్వాత రాముడు ఎలాంటి వేదనకు గురయ్యాడు? సీత ఆచూకీ తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? సీత ఆచూకీని వానరులు చెప్పిన తర్వాత లంక ప్రయాణం ఎలా సాగింది. లంకను చేరుకోవడానికి రామసేతు నిర్మాణం జరిగింది? శ్రీరాముడు, వానర సైన్యంపై రావణసురుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు ఎలా మాయలు చేసి ముప్పు తిప్పలు పెట్టారు. రావణ సంహారం ఎలా జరిగిందనే ప్రశ్నలకు సమాధానమే ఆదిపురుష్ సినిమా కథ.

రావణసురుడు అమరత్వం కోసం తపస్సు చేసే ఎపిసోడ్‌తో కథ మొదలవుతుంది. రావణసుర క్యారెక్టర్‌ను పవర్‌పుల్‌గా చూపించి కథపై ఆసక్తిని రేపడంలో ఓం రావత్ స‌ఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. సీతను రావణసురుడు అపహరించడంతో అసలు కథ మొదలువుతుంది. తొలి భాగంలో సీతా అపహరణ సమయంలో జాటయువుతో ఫైట్, ఆ ఎసిసోడ్‌లో గ్రాఫిక్ వర్క్ ఆకట్టుకొనేలా ఉంటుంది. వాలి, సుగ్రీవ మధ్య ఫైట్, రామసేతు నిర్మాణ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌గా కనపడుతాయి. దర్శకుడు సినిమాను టెక్నికల్‌గా నెక్ట్స్ లెవ‌ల్‌లో చేశాడనే చెప్పాలి. కాకపోతే కథలో ఎక్సైట్‌మెంట్ లేకపోవడం కొంత నిరాశగా ఉంటుంది. కొన్ని సీన్ల‌ను కొంత భిన్నంగా తీసే ప్ర‌య‌త్నం చేశాడు. ఇలా చేసిన సీన్లు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌వు.

ఇక సెకండాఫ్‌లో రామసేతు నిర్మాణం సమయంలో సముద్రుడు, రాముడు మధ్య నడిచే సీన్ గ్రాఫిక్ వర్క్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సంజీవని పర్వతాన్ని అంజనేయుడు తీసుకు రావడం, అలాగే ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పోరాటాలు బాగా చిత్రీకరించారు. రాముడు – రావణుడు తొలిసారి కలుసుకొనే స‌న్నివేశం కొత్తగా, ఆస‌క్తిగా ఉంటుంది. టెక్నికల్‌గా సినిమాను డీల్ చేసే క్రమంలో కథపరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో తడబాటు కనిపించింది. కథ కంటే టెక్నికల్ అంశాలే డామినేట్ చేశాయనిపిస్తుంది. ఓవరాల్‌గా కథలో ఎమోషన్స్, ఎక్సైట్‌మెంట్ పెద్దగా కనిపించవు.

న‌టీన‌టుల ప్ర‌తిభ:
శ్రీరాముడిగా కొత్త లుక్‌లో ప్రభాస్ కనిపించారు. అయితే మనకు రాముడంటే నీలమేఘశ్యాం అనే మనసులో ముద్ర పడింది. శ్రీరాముడిని బాడీ కలర్ నీలంలో లేకపోవడంతో కొంత కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా ప్ర‌భాస్‌కు మీసాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి పాత్ర‌లో ప్రభాస్ తెర మీద అద్బుతంగా కనిపించాడు. సీతగా కృతిసనన్‌కు పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ఇక ఈ సినిమాలో పూర్తిగా డామినేట్ చేసినది రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ అని చెప్పుకోవాల్సిందే. లంకేశ్వరుడిగా సైఫ్ నటన బాగుంది. అతడి ఆహార్యం, హావభావాలు కొత్తగా ఉన్నాయి. మండోదరిగా సొనాల్ చౌహాన్, శూర్పణఖగా తృప్తి తొడర్‌మల్, హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ ఫర్వాలేదనిపించారు.

టెక్నిక‌ల్ టీమ్ ప‌నితీరు:
ఆదిపురుష్ సినిమాకు మొత్తంగా ప్రాణం పోసింది గ్రాఫిక్స్ ఆండ్ మ్యూజిక్. అజయ్ అతులు అందించిన పాటలు మ‌న‌సుదోచుకుంటాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అత్యంత బలమైన అంశంగా మారిందని చెప్పవచ్చు. సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టడంలో బీజీఎం వర్క్ చాలా బాగుంది. ఇక VFX గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో 3D ఫార్మాట్‌‌కు సంబంధించి బెస్ట్ గ్రాఫిక్ వర్క్ జరిగిన సినిమాగా ఆదిపురుష్‌ను చెప్పుకోవచ్చు. చాలా చోట్ల 3D ఎఫెక్ట్స్ థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. సినిమాటోగ్రఫి విజువల్ ఫీస్ట్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ నాసిరకంగా అనిపిస్తుంది. ఆర్ట్ విభాగం (VFX) పనితీరు స్పెషల్ ఎట్రాక్షన్‌ అని చెప్పవచ్చు.

యుద్ధ సీన్లు, డైలాగులు బాహుబలిని గుర్తు చేస్తాయి. ‘బాహుబలి’ యుద్ధాన్ని కొత్తగా చూసినట్టు ఉంటుంది. రాముడు బాణం విసిరే స్టైల్, ఆ సీన్స్ ఆకట్టుకుంటాయి. రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు చూసి ఓ అంచనాతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులకు సినిమా ప్రారంభం నుంచి ఓం రౌత్ సర్‌ప్రైజ్ ఇస్తూనే వుంటాడు. కాస్త భిన్నంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక‌ ‘వానర సైన్యం చూస్తే ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’లో వానరాలు గుర్తుకు వస్తాయి. లంకలో రావణుడి సైన్యం చూస్తే హాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్లు చూసినట్టు ఉంటాయి. హనుమాన్ సీన్లు మెప్పిస్తాయి.

అయితే కథపై కంటే టెక్నికల్‌ అంశాలపైనే దృష్టిపెట్టడం అసంతృప్తిని కలిగిస్తుంది. చాలాచోట్ల‌ ఎమోష‌న్స్ పెంచాల్సింది. ఇక కొన్ని సీన్లు పెద్ద‌గా ఉంటూ బోర్ కొట్టిస్తాయి. త‌గ్గించాల్సింది. అయితే రామాయణాన్ని క్రియేటివ్ లిబర్టిని వాడుకొని నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మోడర్న్‌గా, టెక్నికల్‌గా చెప్పిన ప్రయత్నం అనిపిస్తుంది. పెద్దలకు రామాయణం రకరకాల చూసిన అనుభూతి ఉంది. కాబట్టి వారికి ఈ సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ పిల్లలను ఆలరించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. కథకు సంబంధించిన ఎమోషనల్, ఎక్సైట్‌మెంట్ కంటే టెక్నికల్‌గా ఈ సినిమా బాగా ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి అంచనాలు లేకుండా వెళ్లితే మంచి అనుభూతిని పంచే సినిమా ఆదిపురుష్.

రేటింగ్ 3 / 5

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

By admin