▪️ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్
▪️ రవీంద్రభారతిలో అన్నాబావు సాఠె 103వ జయంతి వేడుకలు
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
అట్టడుగు వర్గాలకు అండగా నిలవడమే కాకుండా ఆ వర్గాల సాహిత్యాన్ని వెలికి తీసి భావి తరాలకు అందించాలన్న తపన ఉన్న దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల సాహిత్యానికి సమ ప్రాధాన్యత కల్పిస్తూ ఇప్పటివరకు వెలుగు చూడని అట్టడుగునున్న సాహిత్యాన్ని పదిలపరచాలన్న కేసీఆర్ ఆదేశం మేరకు అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని రికార్డు చేసే పని మొదలు పెట్టామని తెలిపారు. అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అందులో భాగంగా అత్యంత వెనుకబడ్డ దళిత కులాల సాహిత్య చరిత్రలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. మరాఠా సాహిత్య సామ్రాట్, దళిత విప్లవకారుడు అన్నాబావు సాఠె 103వ జయంతి సందర్భంగా నేడు ఆ మహనీయుడి సొంత గ్రామం మహారాష్ట్రలోని వాటేగావ్ కు సీఎం కేసీఆర్ వెళ్లి ఉత్సవాలు జరపడం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం అని కొనియాడారు.
మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతీలో అన్నాబావు సాఠె జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్.. అన్నాబావు సాఠె జీవితచరిత్రను వివరించారు.
ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్న ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని కొనియాడుతూ.. మూడు ప్రధాన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టారు. వచ్చే జయంతి నాటికి అన్నబావ్ సాఠె విగ్రహాన్ని ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని, మంగ్ కులస్థులకు పొడుభూముల పట్టాలు ఇవ్వాలని, కులాధ్రువీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ అంబేద్కర్ వాది జేబీ రాజు, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, మహేశ్వర రాజ్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ పరికిపండ్ల, సీనియర్ జర్నలిస్టు స్వామి ముద్దం, దయానంద్, మాంగ్ సమాజ్ సెక్రటరీ కాంబ్లే శంకర్ మాంగ్, మాంగ్ సమాజ్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గడేకర్ పరశురామ్ మాంగ్, మాంగ్ సమాజ్ హైదరాబాద్ సిటీ కమిటీ అధ్యక్షుడు కాంబ్లే సుధాకర్ మాంగ్, MST టీజరర్ జీకే కుశల్ రావు, గోవింద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాంగ్ కుల సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
- HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP