మెల్బోర్న్ (మీడియాబాస్ నెట్‌వర్క్):
ఖండాంతరాల్లోనూ బతుకమ్మ అందంగా అలంకరించుకుంటోంది. దేశవిదేశాల్లో మన ఆడపడుచులు బతుకమ్మ సంబురాలు నిర్వహించుకుంటున్నారు ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలో ATAI ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి, ATAI సభ్యులు, Wyndham సిటీ కౌన్సిల్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. మెల్బోర్న్ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యరు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా ఆడలేక పోయినందుకు ఈ సంవత్సరం ఆడపడుచులు చాలా ఉత్సాహంగా ఆడారు.
ATAI ప్రధాన ఆశయాల లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించటం ప్రధానమైనది. సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు తీసుకొనిపోవాలంటే ఇప్పుడు యువకులకు పిల్లలకి నేర్పించినట్లయితే అది బావితరాలకు సంక్రమిస్తదనేది అధ్యక్షుని అభిప్రాయం. ఈ లక్ష్యం కార్యరూపం దాల్చే దిశగా ATAI అడుగులు పడుతున్నవి. ATAI ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు బతుకమ్మ ఆడటం, పిల్లలకు పెయింటింగ్, డ్రాయింగ్, డిబేట్ వంటి కార్యక్రమాలు జరుపుకోవటం జరుగుతుంది.
ఎంగిలిపూల బతుకమ్మ కు ATAI కార్యవర్గసభ్యులు సకినాలు, సర్వపిండి, పచ్చిపులుసు, మలిలముద్దలు వంటి తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు విందు ఏర్పాటు చేసినారు. ప్రతి సంవత్సరం ATAI బతుకమ్మలను తెచ్చిన ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రధమ 3 బతుకమ్మలను బంగారు నాణాలను మరియు ప్రతి ఒక్క బతుకమ్మ కు వెండి నాణాలను ఇవ్వటం జరుగుతుంది.
ఇండియా నుండి ప్రముఖ గాయని మధుప్రియ, ప్రముఖ వీణా కళాకారిణి వాణి, ప్రముఖ కళాకారుడు భిక్షు నాయక్ తదితరులు రానున్నారు. శనివారం అక్టోబర్ 1 న 3PM నుండి 10 PM వరకు Altona Westgate సెంటర్ లో జరుగనున్న ప్రధాన బతుకమ్మ సంబరాలకు మెల్బోర్న్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ATAI అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి , సభ్యులు కోరారు.