మ‌ర్రిగూడ: న‌ల్గొండ జిల్లా మ‌ర్రిగూడ మండ‌ల రైతులకు ప్రకృతి వ్యవసాయంపైన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) అవ‌గాహ‌ణ‌, శిక్షణ శిబిరం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ వినీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీఎఫ్ – జైకిష‌న్ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ‌లో ప్రకృతి వ్యవసాయన్ని ప్రోత్సహించడానికి, రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కోసం ”మన విత్తనాలు, మన పంటలు మన ఆరోగ్యం” అనే నినాదంతో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ తెలంగాణ వ్యవసాయ సంఘం మెంబర్ మారకంటి భవాని మాట్లాడుతూ.. టీడీఎఫ్ – జైకిష‌న్ ప్రాజెక్టును అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై నిరంత‌రం కృషి చేస్తున్న టీడీఎఫ్ – జైకిష‌న్ ప్రాజెక్టును అభినందించారు.

ప్రకృతి వ్యవసాయంలో అనుభవం కలిగిన నైపుణ్యం ఉన్న‌ ప్రకృతి వ్యవసాయదారులు ప్రసాద్ రెడ్డి, బైరెడ్డి నరేష్ రెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహ రెడ్డి, ఇందిరా, పార్టీ నరేందర్ రెడ్డి రైతులకి ప్రకృతి వ్యవసాయం పైన శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో ఎందుకు చేయాలో చేస్తే దానివల్ల వచ్చే లాభాలేందో రైతులకు ఆధునిక పద్ధతుల ద్వారా వివరించారు. అలాగే యువతరం కూడా ముందుకొచ్చి వ్యవసాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతులకి ఉచితంగా సేంద్రియ ఎరువులు అందజేసిన విశ్వ ఆగ్రోటెక్ కంపెనీ సీఈఓ బైరి సుభాష్‌కి, కంపెనీ సేల్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్‌ రాజుకి తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా టీడీఎఫ్ – యూఎస్ఏ అధ్య‌క్షుడు శ్రీనివాస్ మ‌ణికొండ మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక అభివృద్ధి, వినియోగదారుల ఆరోగ్యమే ల‌క్ష్యంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ఆవ‌శ్య‌క‌త‌పై శ్రీనివాస్ మ‌ణికొండ ప్ర‌సంగించారు. కెమిక‌ల్స్, పురుగుమందుల వాడకం ప్రమాదకర స్థాయిలో పెరిగి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంద‌ని, ఇక్కడ ప్రతి హెక్టారుకు సుమారు 900 కిలోల పురుగు మందులు వాడుతున్నార‌ని, ఇది ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అమెరికాలో వ్య‌వ‌సాయం చేసే ప‌ద్ద‌తిని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ వివ‌రించారు.

టీడీఎఫ్ – ఇండియా అధ్య‌క్షుడు రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయన్నీ ప్రోత్సహించడానికి మన విత్తనాలు, మన పంటలు మన ఆరోగ్యం అనే నినాదంతో టీడీఎఫ్ అనేక కార్య‌క్ర‌మాలు రూపొందిస్తోంద‌ని తెలిపారు. విప‌రీతంగా రసాయనిక మందులు వాడ‌టం వ‌ల్ల పంట‌లు పండించే రైతుల‌కు, ఆహారాన్ని తీసుకునే ప్రజల ఆరోగ్యానికి భవిష్యత్తులో తీవ్రమైన ప్రమాదంగా మారుతుంద‌ని, వాటి నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వైపు వెళ్లే ప్ర‌య‌త్నాలు చేయాల‌న్నారు. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ప్ర‌కృతి వ్యవసాయం చేయాలని కోరారు.

ఈ శిక్షణ శిబిరంలో ప్ర‌కృతి వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతులతో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆధునిక పద్ధతిలో ఎల్ఈడీ స్క్రీన్ మీద బొమ్మలు, వీడియో రూపంలో రైతుల‌కు శిక్షణ ఇచ్చారు. శిక్షణ శిబిరానికి వ‌చ్చిన రైతులకు ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలి? ఎందుకు చేయాలి? చేయడం వల్ల ఏం లాభాలు? ఏంటానే విష‌యాలు ఉత్తమ రైతులు వివరించారు. రసాయనిక మందులు వాడాకుండ ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలో తెలిపారు. పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయం పద్ధతి “జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్” గురించి ఉత్తమ రైతులు ప‌లు విష‌యాలు పంచుకున్నారు.

శిక్షణ శిబిరానికి వ‌చ్చిన్న రైతులకి స్వదేశీ సహజ ఆహార పదార్థాలతో అన్న సంతర్పణ భోజనాన్ని అందించారు. ప్ర‌కృతి వ్యవసాయం చేయాలనుకుంటున్న అభ్యుదయ రైతులకి సేంద్రియ ఎరువులు బ్యాగ్ కిట్స్ పంపిణి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌ ఉత్పత్తులు, రైతులకు సంబంధించిన వివిధ రకాలైన స్టాల్స్ ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో 500 మంది రైతులు పాల్గొన్నారు., ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్, మర్రిగూడ వ్యవసాయ అధికారి హేమలత, వివిధ గ్రామాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

GTA వేదిక‌పై ఎన్నారైల‌కు ‘స్వ‌దేశం’ ప‌రిచ‌య కార్య‌క్ర‌మం

By admin