✍🏻 ఎడిటోరియల్
భారత్ – ఇండియా.. ఈ పదాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 సదస్సు జరగనున్న వేళ. ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చనున్నారనే అంశం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. సదస్సులో పాల్గొనే అతిధులు, ఇతర ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందు ‘ఆహ్వానం’ ఇందుకు కారణమయ్యింది. ‘ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ప్రకటించడంపై రాజకీయ పార్టీలు, నేతలు, ప్రముఖులు, సామాన్యులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా…? భారత్…? అసలు. ఈ విషయంపై సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పింది?
‘ఇండియా, ఇది భారత్, రాష్ట్రాల సమాఖ్య’ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 స్పష్టంగా చెబుతోంది. దీని ప్రకారం. ‘మన దేశం పేరు ‘ఇండియా’ లేదా “భారత్. ఈ రెండూ అధికారిక పేర్లే. అనధికారికంగా ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. అయితే, తాజాగా రాష్ట్రపతి ఇచ్చిన ఆహ్వాన లేఖలో “ప్రెసిడెంట్ ఆఫ్ బారత్ అని మాత్రమే పేర్కొనడంతో… ఇండియా పేరును ‘భారత్‌గా మార్చనున్నారా…? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఇలా ఇండియా పేరు మార్పు ప్రస్తావన గతంలో లోక్‌సభలోనూ వచ్చింది. ఈ పేరును మార్చాలంటూ సుప్రీం కోర్టులో గతంలో అనేక పిటిషన్లు మేసినప్పటికీ… వాటిని మాత్రం భారత అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘భారత్‌గా పేరు మార్చాలని కోరుతూ మహారాష్ట్రకు చెందిన నిరంజన్ భత్వాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పలుమార్లు పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. అదే సమయంలో కేంద్రం. అభిప్రాయం కోరింది. దీనిపై భారత ప్రభుత్వం నవంబర్ 2015లో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. “ఇండియాకు ‘బదులు ‘భారత్’ అని పిలవాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ (1)లో మార్పులు చేయాల్సిన పరిస్థితులు లేవని పేర్కొంది. రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే ఈ పేరుకు సంబంధించిన అంశాలను రాజ్యాంగ సభ విస్తృతంగా చర్చించిందని… అందుకు అనుగుణంగానే ఆర్టికల్ 1లోని నిబంధనలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ‘ఇండియా’ లేదా ‘భారత్. రెండింటిలో తమకు నచ్చినడాన్ని పిలుచుకోవచ్చని 2018 మార్చి 11 నాటి విచారణ సందర్భంగా జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. ఆ తర్వాత మరో నాలుగేళ్లకు (2020 జూన్‌లోనూ) సుప్రీంకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలైంది.
‘ఇండియా’ అనే ‘పదం వలసవాదులు ఇచ్చిందని… అది బానిసత్వానికి చిహ్నంగా ఉందని పిటిషనర్ వాదించారు. అందుకే ఆర్టికల్ 1ను సవరించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించాలని కోరారు. సుప్రీం దాన్ని కూడా తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఇండియా, భారత్… రెండు పేర్లూ ఉన్నాయని అప్పటి చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోజ్డే పేర్కొన్నారు. ఇదే పిటిషన్‌ను ‘అభ్యర్థనగా మార్చుకొని… కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని పిటిషనర్‌కు సూచించారు.
రాజ్యాంగ సవరణ చేయొచ్చా..?
ఒకవేళ ఇండియాకు బదులు ‘భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే మాత్రం… రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్టికల్ 1లో సవరణ చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టాలి. అయితే సాధారణ మెజార్టీతో (మొత్తం సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువ) దీన్ని సవరించడం వీలుకాదు. ఆర్టికల్ 1ను. ‘సవరించాలంటే ప్రత్యేక మెజార్టీ (మూడింట రెండొంతుల మెజార్జ)తో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ‘భారత్‌గా మార్చేందుకు సంబంధించిన బిల్లును ఈ నెల మూడో వారంలో (సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు) జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
APP Link https://rb.gy/lfp2r