▪️17వ తేదీ తర్వాత ఏ రోజైనా ప్రకటించే అవకాశం
▪️ఫ‌స్ట్ లిస్టులో ఇద్దరు మంత్రులు ఔట్‌?
▪️ప్రతికూల నివేదిక వచ్చినవారికి నో ఛాన్స్

హైద‌రాబాద్: 
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిక్క‌ని వ్యూహాలు ఎవ‌రికి అంతుచిక్క‌వు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి విపక్షాలకు ఏ మాత్రం ప్రచారం చేసుకునేందుకు సమయం ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసిన గులాబీ దళపతి ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం మీడియా స‌మాచారం, విశ్లేష‌ణ‌లు, నిఘా వర్గాల ఇంటలిజెన్స్‌ నివేదికలు తెప్పించుకుంటూనే మరోవైపు ప్రయివేటు సర్వే సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందంతో ఇదివరకే పలు దఫాలు సర్వే చేయించినట్టు సమాచారం. ఆయన జాబితాలో ప్రతికూల నివేదిక వచ్చినవారిని ఇప్పటికే ప్రగతి భవన్‌కు పిలిపించి కేసీఆర్ క్లాసు కూడా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో మరోసారి ఐ-ప్యాక్‌ టీ-మ్‌ సర్వే జరిపి కేసీఆర్‌కు రిపోర్టిచ్చింది. తాజా రిపోర్టులో నెగెటివ్‌ వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ షాకిస్తారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు నెలాఖరు నాటికే సగానికి పైగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం. అధిక మాసం కావడంతో కేసీఆర్‌ సెంటిమెంటు పరంగా కొంత ఆలోచిస్తున్నారని, లేకపోతే ఆగస్టు 12 లేదా 13 తేదీలలోనే ఏకంగా 87 సీట్లకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించేవారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అధిక మాసంలో ఎందుకనుకుంటే మాత్రం ఆగస్టు 17 తర్వాత ఏ క్షణమైనా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటిస్తారని సమాచారం. అయితే, ఈ లిస్టులో సిట్టింగులందరికీ పోటీ చేసే అవకాశం ఇస్తారా లేక కొందరిని తప్పిస్తారా అనేది ఆసక్తిక‌రంగా మారింది. సిట్టింగుల్లో ఎవరికైనా టిక్కెట్‌ దక్కకుంటే వారు ప్రత్యర్థి పార్టీల వైపు చూసే అవకాశాలుండడంతో వారితో ముందుగానే ఓ మాట చెప్పడం ద్వారా వారి భవిష్యత్‌పై భరోసా కల్పించాలని కూడా కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2018లో అనూహ్య నిర్ణయంతో ముందస్తుకు వెళ్ళిన కేసీఆర్‌.. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. సెప్టెంబర్‌ నెలలోనే అభ్యర్థులను ప్రకటించి.. క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని వారికి చెప్పారు. తెలంగాణలో 119 సీట్లు ఉండగా ఎన్నికలకు 3 నెలల ముందుగానే ఏకంగా 105 సీట్లకు అభ్యర్థులను అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

80కి పైగా సిద్ధం..
తాజాగా 80 నుంచి 87 సీట్లకు అభ్యర్థుల లిస్టును కేసీఆర్‌ ఖరారు చేసినట్లు సమాచారం. ఆగస్టు మూడో వారం కల్లా జాబితాను వెల్లడిస్తారని ప్రచారం జరుగుతోంది. ఫ‌స్ట్ లిస్టులో ఒకరిద్దరు మంత్రుల పేర్లు ఉండకపోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి ఉన్నారని టాక్. సదరు మంత్రికి సంబంధించిన అభ్యర్థిత్వంపై ఎన్నిసార్లు సర్వేలు జరిపించినా, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించినా ప్రతికూల నివేదికలు వస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆ మంత్రి నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉన్న విపక్ష పార్టీ నాయకుడిని బీఆర్ఎస్‌లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్‌ కట్టబెట్టాలని.. మంత్రిని ఇబ్బంది పెట్టకుండా లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయించడమా లేదా ఎమ్మెల్సీగా అవకాశమివ్వడమో చేయాలన్న ప్రతిపాదన సీఎం కేసీఆర్‌ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. మొత్త‌మ్మీద గులాబీ ద‌ళ‌ప‌తి వ్యూహాల‌కు ప‌దును పెడుతూ అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

స‌ర్వే: గెలుపు గుర్రాలెవ‌రు?
ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలిచే ఛాన్స్ ఉంది? నెగిటివ్ ఎవ‌రికి? పాజిటివ్ ఎవ‌రికి? ఈ అంశాల‌పై ప్ర‌ముఖ పొలిటిక‌ల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘గేమ్ ఛేంజ‌ర్’ (www.gamechanzer.com) నియోజక‌వ‌ర్గాల వారిగా స‌ర్వే నిర్వ‌హిస్తోంది. ప్ర‌స్తుతం కొనసాగుతోన్న‌ ఈ స‌ర్వే త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతంది. ఈ స‌ర్వే రిపోర్ట్ తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయ‌ పార్టీల‌కు కీల‌కంగా మార‌బోతోంది.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

 

By admin