న్యూజెర్సీ (స్వాతి దేవినేని):

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవ‌డంతో ఆ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. ఇందులో భాగంగా విజయ్ దివస్ సంబరాలను అమెరికాలోని ప‌లు న‌గ‌రాల్లో జ‌రుప‌కున్నారు. ఓవ‌ర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ – యూఎస్ఎ స‌భ్యులు విజయోత్సవ వేడుకను న్యూజెర్సీలో యూఎస్ఎ ప్రెసిడెంట్ అడ‌పా ప్ర‌సాద్, సెక్ర‌ట‌రీ వాసుదేవ్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలో జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో గుజ‌రాత్ నూత‌న ముఖ్య‌మంత్రి భూపేంద్ర పటేల్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిన‌ బీజేపీ.. గుజ‌రాత్ భారీ విజ‌యంతో తిరుగులేని స్థాయికి చేరుకుంద‌ని కొనియాడారు.

ఈ సంద‌ర్భంగా ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ పూర్వ జాతీయ అధ్యక్షులు, కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో, బీజేపీ గణ విజయంలో, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ నిర్వహించిన కీలక పాత్రను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నుంచి చాలా కార్యకర్తలు, వాసుదేవ్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ వెళ్లి అక్కడ ప్రచారం చేశార‌ని తెలిపారు.

వాషింగ్టన్ డీసీలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అడపా ప్రసాద్ మాట్లాడుతూ.. ఓట్ల సరళి, ఓటింగ్ శాతం పెరిగిన విధానాన్ని వివరించారు, వరసగా 7వ సారి గెలవటం నిజముగా గుజరాత్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు. మోదీకి ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సీనియర్ నాయ‌కులు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలో కూడా బలోపితం అవడానికి అఫ్ బీజేపీ పని చేస్తుంది అన్నారు. తెలంగాణ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ‌టం ఖాయ‌మ‌న్నారు. గుజరాత్ విజయోస్తవాల్లో పాల్గొన్న ప్రవాస భారతీయులకు, ఎన్నికల్లో విశేషంగా కృషి చేసిన ఓవర్ సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ టీమ్ కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా పలు రాష్ట్రాలలో టంపా (ఫ్లోరిడా), డల్లాస్, హౌస్టన్ (టెక్సాస్), కాలిఫోర్నియా, చికాగోలో విజయ్ దివస్ సంబరాలు జరిగాయి. తరువాత, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు, జయేష్ పటేల్ , సురేష్ జానీ ఎచ్ ఆర్ షాహ, అలాగే సీనియర్ నేతలు అమర్ గోస్వామి , అజయ్ గోస్వామి కల్పన శుక్లా , డాక్టర్ సుధీర్ పారిక్, డాక్టర్ హెచ్ ఆర్ షా, సునీల్ నాయక్, అరవింద్ పటేల్ (రాజ్ భోగ్), బాల గురు, ప్రసంగించి ఈ ఎన్నికల విజయాల ప్రాముఖ్యతను తెలిపారు.

ఈ సంబరాల్లో ఓఎఫ్ బీజేపీ టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, విలాస్ రెడ్డి, హరీ సేతు, దీప్ భట్, సంతోష్ , మధుకర్, పార్తీబన్ ఇతర ఓఎఫ్ బీజేపీ నేతలు గుంజన్ మిశ్ర, అమర్ ఉపాధ్యాయ్, రాజేష్ రెడ్డి, ప్రేమ్ కాట్రగడ్డ, మధు అన్న, బసవ శేఖర్.. ఇంకా ఇతర సంఘల నాయకులు పాల్గొన్నారు. అనేక సంఘాల నేతలు, ప‌లువురు ప్రవాస భారతీయులు ఉత్సహంగా పాల్గొన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
BREAKINGNEWS TV & APP
http://swadesam.com/
NRIల‌కు గుడ్‌న్యూస్. మీకు ఇండియా(తెలుగు రాష్ట్రాల‌లో) ఎలాంటి స‌ర్వీసు అవ‌స‌రం ఉన్నా ఈ వెబ్‌సైట్‌లో డీటైల్స్‌తో మెసెజ్ పెట్టండి. ఇండియాలో ఉన్న స్వ‌దేశం స‌ర్వీసు టీంతో త్వ‌ర‌గా స‌ర్వీసు పొందండి. www.swadesam.com

 

 

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *