న్యూఢిల్లీ (మీడియాబాస్ నెట్‌వర్క్): తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలలో అత్యంత వెనుకబడిన 57 కులాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి దేశ రాజధాని ఢిల్లీలోనీ జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ విజయ్ సంప్లా గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితులకు అందే విద్యా, ఉద్యోగ, ఆర్థిక,రాజకీయ ప్రయోజనాలు మాల, మాదిగలు తప్ప దళితులలో 34 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన 57 కులాలు పొందలేదని, మోచి, హోలేయదాసరి, మాలజంగం, సమగరా, మాష్టిన్, మాంగ్ తదితర 10 కులాలు కనీసం కుల ధృవీకరణ పత్రాలను పొందడంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తూ కులధ్రవీకరణ పత్రాలను తహశీల్దార్ ద్వారా ఇవ్వాలని కోరారు, మాదిగల కులగురువులైన మాదిగజంగం (నులక చందయ్య) కులాన్ని గెజిట్ లో చేర్చాలని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాదసికురువ/మాదారికురువ కులస్తులకు గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన సిఫారసుల ప్రకారం తెలంగాణ ప్రభుత్వ మెమో : 1268 ను అమలుచేసి గతంలో “కురువ (BC)” కులదృవీకరణ పత్రాలు ఇచ్చిన వారందరికి ఎస్సి మాదసికురువ కులదృవీకరణ పత్రాలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్పుల భాస్కర్ బైండ్ల, ఆదిముల్ల వెంకటేశ్ హోలియదాసరి, నిరగొండ బుచ్ఛన్న గోసంగి, ఏదుల్ల గౌరీశంకర్ బైండ్ల ,రాయిల లక్ష్మినర్సయ్య చిందు,మల్లెల సాయి చరణ్ గోసంగి, పోతుల మల్లేష్ మాదసి కురువ, బక్కురీ పవన్ ద్యావతీ, గౌడి అమర్నాథ్ మాలజంగం, రాగిషెట్టి పెంటయ్య మోచి తదితరులు పాల్గొన్నారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews