సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది.