గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్,  రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు హీరోగా ఆర్కే మలినేని  దర్శకత్వంలో ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన చిత్రం.‘క్యాలీ ఫ్లవర్‌’ ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.కరోనా టైం లో ఈ సినిమా విడుదల చేయడం జరిగింది. అప్పుడు చూడని ప్రేక్షకుల కోసం ఈ నెల ఏప్రిల్  9 నుండి అన్ని ఓటిటి లో ఫ్లాట్ ఫామ్స్ లలో “క్యాలీ ఫ్లవర్” సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఆశా జ్యోతి, శ్రీరామ్ లు మాట్లాడుతూ.. ఈ నెల 9 న మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్స్ ద్వారా ఓటిటి ఫ్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ కాబోతోంది.థియేటర్స్ లలో మిస్సైన ప్రేక్షకులందరూ మా “క్యాలీఫ్లవర్” చిత్రాన్ని  ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

 

ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్స్ సి.ఇ. ఓ రాజీవ్ మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చి చాలా కంటెంట్ చాలా విధాలుగా నష్ట పోయాము.ఎన్నో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా మిగిలిపోయాయి.అలాంటి వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది.ఇప్పుడు రిలీజ్  ఈ సినిమాతో 500 సినిమా అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావాలని మనస్పూర్తిగా ఈ నెల 9 న వస్తున్న మా ఓటిటి లో వస్తున్న మా చిత్రాన్ని

దర్శకుడు  ఆర్.కె.మలినేని మాట్లాడుతూ.. శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ ను ఈ సినిమాలో చెప్పడం జరిగింది.నవంబర్ 26 మదర్ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.ఎన్నో సీరియల్స్ తీసిన నన్ను చాలా మంది ఇన్ని సీరియల్స్ చేస్తున్న నువ్వు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను ఎందుకు తీయలేవు అన్నదానికి సమాధానమే ఈ కాలిఫ్లవర్ ..మేము చేసిన మంచి ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేయాలని  మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

గోపి కిరణ్  మాట్లాడుతూ..ఈ “క్యాలీఫ్లవర్” మూవీని దర్శక, నిర్మాతలు ఒక యజ్ఞంలా ఈ వినిమాను తియ్యడం జరిగింది.సినిమాకు కావలసిన ప్రతి ఎలిమెంట్స్ ను  వారు  ఖర్చుకు రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు.అలాగే ప్రతి పాయింట్ ను,ప్రతి ఫ్రెమ్ ను దర్శకుడు ఆర్.కె మలినేని  అందంగా తీర్చిదిద్దారు . థియేటర్స్ లో మిస్ అయిన వారుంటే ఈ  నెల 9న అమెజాన్ ప్రైమ్ ,హంగామా మొదలగు ఓటిటి ప్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ అవుతుంది .అందరూ మా సినిమాను చూడాలని కోరుతున్నాను అన్నారు.

గోపి మోహన్ మాట్లాడుతూ..ఈ సినిమాను నేషనల్ వైడ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కొరకు కచాలా కస్టపడి చేశారు.అలాగే ఈ సినిమాలో అండర్ కరెంట్ వంటి  మంచి మెసేజ్ కూడా ఉంటుంది.అన్నారు.

 

నటీనటులు:
సంపూర్ణేష్‌బాబు, వాసంతి, పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్‌ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు, విజయ్, కల్యాణీ, సుమన్‌ మనవ్వాద్, ముస్కాన్, బేబీ సహృద, రమణ్‌
దీప్‌

సాంకేతిక నిపుణులు
స్క్రీన్‌ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్కే మలినేని
ప్రొడ్యూసర్‌: ఆశా జ్యోతి గోగినేని
బ్యానర్స్‌: మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: హరిబాబు జెట్టి
సమర్పణ: శ్రీధర్‌ గుడూరు
స్టోరీ: గోపి కిరణ్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రజ్వల్‌ క్రిష్‌
డీఓపీ: ముజీర్‌ మాలిక్‌
ఎడిటర్‌:బాబు
డైలాగ్స్‌: రైటర్‌ మోహన్, పరమతముని శివరామ్‌

By admin