రొమాంటిక్ లవ్, క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టులు ఈ తరం యువతకు తెగ నచ్చేస్తాయి. అదే కోణంలో తాజాగా రొమాంటిక్ లవ్‌తో కూడిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘కేసు 30’ అనే మూవీ రీసెంట్‌గా (ఏప్రిల్ 1న) విడుదలైంది సిద్ధార్థ్ నాయుడు, షామిలీ యునైయల్, తన్వి గావదె తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. పీఎన్ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో యువసాయి క్రియేషన్స్ సమసమర్పణలో ప్రొడ్యూసర్స్ పి.నరసింహరావు, బోడ రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ పైడిమర్రి తెరకెక్కించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.
కథ:
ఈ సినిమా కథ శ్వేత అనే అమ్మాయి దారుణమైన హత్య ఆధారంగా కొనసాగుతుంది. రాత్రిపూట ఒక ఇంట్లో జరిగిన శ్వేత హత్యను పరిశోధించే పనిని వైజాగ్ సిటీ ఇన్‌స్పెక్టర్ అర్జున్ బరద్వాజ్‌కు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. అతనికి ఇది 30వ కేసు. ఈ కేసును అన్‌థ్రెడ్ చేసే ప్రక్రియలో, క్రైమ్ స్పాట్‌లో అర్జున్‌కి ఒక్క క్లూ కూడా లభించలేదు. శ్వేత బాయ్‌ఫ్రెండ్ సిరిల్‌ని విచారించి చిన్నపాటి సమాచారాన్ని సేకరిస్తాడు. అతను ఆ సమాచారంతో శ్వేతను ఎవరు చంపారో తెలుసుకోవడానికి లోతుగా పరిశోధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ కేసును నిర్వహిస్తున్నప్పుడు, అతని గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అతను చాలా ఎమోషనల్, నిరాశకు గురవుతాడు. అతను తన స్నేహితురాల’ గురించి ఆలోచిస్తాడు. అప్పుడు ఫ్లాష్‌బ్యాక్ చుట్టబడింది, నిత్యతో అతని లవ్ ట్రాక్, అక్కడ మరొకరితో సంబంధం కలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ముగుస్తుంది. కేసు చిక్కుముడి విప్పుతున్నప్పుడు అర్జున్, కొంతమంది అనుమానితులను విచారించారు. అతను తన గత సంఘటనలలో కొన్నింటికి అనుమానితుల సమాచారాన్ని వివరించడం ప్రారంభించాడు. అతని ఆశ్చర్యానికి, అనుమానితులు వివరించిన సన్నివేశాలతో ఆ సంఘటనలను ఇంటర్‌లింక్ చేస్తున్నప్పుడు శ్వేత హత్య కేసుపై అతను క్లూస్ పొందాడు. ఈ కేసును అర్జున్ ఎలా పరిష్కరిస్తాడు అనేదే మిగిలిన కథ? అతను ఏ క్లూస్ పొందాడు? శ్వేతను చంపిన నిందితుడు ఎవరు? ఆమె ఎందుకు చంపబడింది? అనే ప్రశ్నలకు ట్విస్టులు ఇస్తూ కథ సాగుతుంది.
ఈ కథను హీరో సిద్ధార్థ్ నాయుడు చాలా గ్రిప్పింగ్ గా రాసాడు. హీరో సిద్ధార్థ్ నాయుడు – డైరెక్టర్ సందీప్ ఇద్దరూ సొంత అన్నదమ్ముళ్లు. ఎటువంటి అనుభవం లేకపోయిన చాలా బాగా డైరెక్ట్ చేసాడు. సినిమాకు డైలాగ్స్ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. డైలాగ్ రైటర్ భరత్ ని చక్కగా ఉపయోగించుకున్నారు. స్క్రీన్‌ప్లే సినిమా స్టార్టింగ్ నుండి మొదలై ముగింపు వరకు పవర్ ప్లే ఉంటుంది. 3 పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఇంకొక హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ వర్క్ బాగా కుదిరింది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడక్షన్ క్వాలిటీ రిచ్‌గా వచ్చింది. ఇక హీరోయిన్లు ఇద్దరూ.. షామిలీ ఉనియాల్ & తన్వి గవాడే ఇద్దరూ హై పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. నటి జ్యోతి లాబాలా ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో కనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఎండ్ కార్డ్ వరకు ఆడియన్స్ లేవకుండా కూర్చోపెట్టాడు దర్శకుడు. అతడు కొత్తవాళ్లందరినీ బాగా హ్యాండిల్ చేసాడు, ఎక్కడ ఇది చిన్న సినిమా అనే ఫీలింగ్ రాకుండా ఆడియన్స్‌ను మెప్పించగడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
రేటింగ్ 3.5/5