హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్):
బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగంలోనూ హైదరాబాద్ రాజధాని విషయం గురించి వుందన్నారు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం ఈ విషయాన్ని రాశారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. బొల్లారం, సికింద్రాబాద్, హైదరాబాద్‌లను ఒక రాష్ట్రంగా చేసి.. దానిని దేశ రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ చెప్పారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. ఇది దేశ భద్రతకు కూడా మంచిదని అంబేద్కర్ తెలిపారని ఆయన చెప్పారు. పాకిస్తాన్, చైనాలకు హైదరాబాద్ ఎంత దూరంలో వుందనే విషయాన్ని బీఆర్ అంబేద్కర్ వెల్లడించారని విద్యాసాగర్ రావు తెలిపారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులను చూస్తుంటే బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని అని అన్నారు. నాలుగేళ్ల తరువాత మళ్లీ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
విద్యాసాగర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అంటూ ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. హైదరాబాద్ రెండో రాజధానికి సంబంధించిన విషయంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని విద్యాసాగర్ రావు సూచించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనా ఆయన స్పందించారు. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన తెలిపారు. కాగా, దేశంలో మరోసారి బీజేపీ గెలిచి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు అదే కోరుకుంటున్నారని చెప్పారు.
***
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews