🔘 మేడ్చ‌ల్‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తాం
🔘 కేసీఆర్ నిరంకుశ పాలనతో అన్నివర్గాల ప్రజలు మోసగించబడ్డారు
🔘 మేడ్చ‌ల్‌లో దూకుడు పెంచిన తోటకూర వజ్రెష్ యాదవ్

మేడ్చ‌ల్: బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయ‌మ‌ని టీ-పీసీసీ రాష్ట్ర‌ ఉపాధ్య‌క్షుడు తోటకూర వ‌జ్రేష్ యాదవ్ అన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంద‌ని, అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనతో ప్రజలు అన్ని విధాలుగా మోసపోయార‌ని మండిప‌డ్డారు.

మేడ్చ‌ల్‌లో దూకుడు పెంచిన తోటకూర వజ్రెష్ యాదవ్ నియోజ‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి మ‌ల్లారెడ్డి చేసిందేమి లేద‌న్నారు. పాల‌న‌లో పూర్తిగా ఫేయిల్ అయ్యాడని, దోచుకున్న డ‌బ్బుతో, దాచుకున్న డ‌బ్బుతో ఓట్లు కొంటాన‌ని చూస్తున్నాడ‌ని, ఈసారి ప్ర‌జ‌లు మ‌ల్లారెడ్డికి డిపాజిట్ కూడా ఇవ్వర‌ని అన్నారు.

గత తొమ్మిదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను హాత్ సే హాత్ జోడో యాత్రలో తెలియజేస్తుంటే రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువత, కులవృత్తులవారు, రైతాంగం స్వరాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడతాయని ఎన్నో ఆశలతో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనతో అన్ని వర్గాల ప్రజలు మోసగించబడ్డారన్నారు.

దేశ ప్రజల సంక్షేమం, భవిష్యత్తు కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అయితే, చిల్లర రాజకీయాలు చేస్తూ దేశ ప్రజలను రెచ్చగొడుతూ చిల్లర రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ అంటూ తోటకూర వ‌జ్రేష్ యాదవ్ మండిప‌డ్డారు.

 

By admin