హైద‌రాబాద్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్): మ‌హారాష్ట్ర‌ మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరారు. చెన్నమనేని వికాస్ రావు ఆయన సతీమణి దీపాతో కలిసి కమలం పార్టీ కండూవ క‌ప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వికాస్ రావు వేములవాడ నుంచి బరిలో దిగనున్నాడు.

అనంతరం చెన్నమనేని వికాస్ రావు మాట్లాడుతూ.. ఈరోజు బీజేపీలో చేరడం తన జీవితంలో మర్చిపోలేనిది.. ఇది భావోద్వేగ సంఘటనగా చెప్పవచ్చన్నారు. బీజేపీకి తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తాను చిన్నప్పటి నుండి సంఘ్ నుంచి పెరిగానని తెలిపారు. చిన్నప్పుడే హేమాహేమీలు వాజపేయ్, అద్వానీ నీడలో పెరిగానని చెప్పారు. కిషన్ రెడ్డి తనకు స్ఫూర్తి ఇచ్చారని.. వారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం గర్వకారణంగా ఉందన్నారు.

రాబోయే రోజుల్లో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో, మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్తానని తెలిపారు. డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు, దీపాలను బీజేపీలోకి స్వాగతిస్తున్నామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీలో దశాబ్ధాలుగా బలమైన కుటుంబం నుండి ఉన్నారని తెలిపారు. చెన్నమనేని వికాస్ రావు వేములవాడ ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. వారి చేరిక పార్టీకి ఎంతో బలం చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీకి ప్రత్యక్ష, పరోక్షంగా సేవలు అందించిన కుటుంబం డాక్టర్ వికాస్ రావుది అని అన్నారు. వారు బీజేపీలో చేరడం సిరిసిల్ల జిల్లాలో పార్టీకి ఎంతో బలం చేకూరుతుందన్నారు. సిరిసిల్ల జిల్లాలో రెండు స్థానాలు గెలిపిస్తామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విపక్షాల నోరు మూయించినా పేదల కోసం మరింత ముందుకు వస్తారని పేర్కొన్నారు.

సేవ‌ కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్న వికాస్
వేములవాడలో ఏడాదిగా వికాస్ రావు సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వికాస్ రావు తండ్రి విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా పని చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ గా పని చేశారు. గతంలో మెట్ పల్లి ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా విద్యాసాగర్ రావు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బేజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ రావు పని చేశారు. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేశ్ ఉన్నారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

By admin