మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన మొదటి మల్టీ స్టారర్ ‘ఆచార్య’. పైగా కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకుడు కొరటాల శివ దీనికి డైరెక్టర్. అందుకే తాజాగా విడుదలయిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మ‌రి సిద్ధ క్యారెక్టర్ లో రామ్ చరణ్, ఆచార్య క్యారెక్టర్ లో చిరంజీవి ధర్మస్థలిని ఎలా రక్షించారు ? సినిమా హిట్టైయ్యిందా ఫట్టయ్యిందా అనేది తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే..

క‌థ‌:
ధర్మస్థలిని కాపాడుకుంటూ అక్కడ ఆయుర్వేద విద్యని ప్రజలకందిస్తూ వారి ఆరోగ్యాలని సంరక్షిస్తూ ఉంటుంది పాదఘట్టం. ఆ పాదఘట్టం వాళ్లని ధర్మస్థలికి రానివ్వకుండా అకృత్యాలు చేస్తుంటాడు బసవ అంటే సోనూ సూద్. ఒక మాములు కార్పెండర్ గా ధర్మస్థలికి వచ్చిన ఆచార్య అంటే చిరంజీవి ఈ బసవ అకృత్యాలకి అడ్డుకట్ట వేస్తాడు. అసలు తాను ధర్మస్థలికి ఎందుకు వచ్చాడో వివరంగా చెబుతాడు. సిద్ధ అంటే రామ్ చరణ్ కోసమే ధర్మస్థలిని రక్షించడానికి వచ్చానని, పాదఘట్టాలని కాపాడటమే తన ధ్యేయమని చెబుతాడు. దీంతో అక్కడి ప్రజలు ఆచార్యని నమ్ముతారు. ప్రజల సహకారంతో, అమ్మవారి ఆశీస్సులతో ఆచార్య అనుకున్నది ఎలా సాధించాడు అన్నదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్..
ఆచార్య గా మెగాస్టార్ యాక్టింగ్, సిద్ధగా రామ్ చరణ్ యాక్టింగ్. వీళ్లిద్దరి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ సినిమాకి ప్లస్ పాయింట్. ఇద్దరు హీరోలని వెండితెరపై చూసుకునే ఆనందం మెగా ఫ్యాన్స్ కి దక్కుతుంది. అంతేకాదు, యాక్షన్ ఎపిసోడ్స్ కొరటాల స్టైల్లో తీశారు. అలాగే, మెగాస్టార్ స్టిల్స్ అభినయంతో మరోసారి తనకి వయసు అయిపోలేదని నిరూపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్, రామ్ చరణ్ చిరంజీవి కలిసే సీన్స్, బంజారా సాంగ్ సినిమాకి ప్రాణం పోశాయి. మణిశర్మ మ్యూజిక్ పాసై పోయింది. చిరంజీవి ఎలివేషన్స్ అప్పుడు వచ్చే ఆర్ ఆర్ హైలెట్ అని చెప్పాలి. కెమెరా వర్క్, కొరటాల శివ టేకింగ్, ప్రొడక్షన్, సెట్ వర్క్ సూపర్బ్…

మైనస్ పాయింట్స్ ..
సినిమాలో మెగాస్టార్ కి ఉండాల్సిన గ్రేస్ మిస్ అయ్యింది. చిరంజీవి లాంటి స్టార్ ని పెట్టుకుని సైలెంట్ గా యాక్టింగ్ చేయించాడు కొరటాల శివ. సరదా సన్నివేశాలు రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అలాగే, పవర్ ఫుల్ డైలాగ్స్ లేవు, చిరంజీవి డ్యాన్స్ లో గ్రేస్ ఫుల్ స్టెప్పులు లేవు. రామ్ చరణ్ చిరంజీవి ఒకేసారి తెరపై కనిపించే సీన్స్ ఏదైనా చెప్పుకోదగ్గది ఉంది అంటే అది మైనింగ్ వర్క్స్ జరిగేటపుడు ఆచార్య టీమ్ వాళ్లని చంపే సీన్ మాత్రమే. అది మినహాయిస్తే గ్రేస్ ఉండే సీన్స్ మిస్ అయ్యాయి. అలాగే, స్లో న్యారేషన్ సినిమాకి మైనస్ అయ్యింది. కథ అక్కడక్కడే తిరుగుతూ క్లైమాక్స్ వరకూ వెళ్లడం, ప్లయిన్ గా సాదాసీదాగా ఉండటం, రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ ఫార్మాలాలో వెళ్లడం సినిమా లయని దెబ్బతీసింది.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే, చిరంజీవి హార్ట్ కోర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా తీశారు డైరెక్టర్ కొరటాల శివ. ఖైదీ నెంబర్ 150 , సైరాలతో పోలిస్తే ఈ సినిమా యావరేజ్ అనే చెప్పాలి.

రేటింగ్ 2/5

www.hystar.in

HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి.. HyStar APP Google play store link: https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar website link: www.hystar.in

 

By admin