▪️ పురాత‌న ప్ర‌పంచ రాజ‌ధానిగా ద్వారకా న‌గ‌రం
▪️ ఆధారాలు చూపిస్తున్న‌ ITS 6TH WOW సంస్థ
▪️ రవీంద్రజిత్ ఆధ్వ‌ర్యంలో ప‌రిశోధ‌నలు
▪️ అభినందించిన‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

అమరావతి: “జై ద్వారకా క్యాంపైన్‌”ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌చివాల‌యంలో ప్రారంభించారు. “ఇట్స్ సిక్స్‌త్ వావ్” (ITS 6TH WOW) సంస్థ ఆధ్వ‌ర్యంలో సముద్ర గర్భంలో ఉన్న పురాతన‌ ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన సంచలనాత్మక అన్వేషణను ముఖ్య‌మంత్రి అభినందించారు. “కృష్ణం వందే జగద్గురుం” అనే శ్లోకం ద్వారకా పురాతన విష‌యాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నందుకు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ క్యాంపైన్‌లో తన వంతు సహకారం అందిస్తాన‌న్నారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో నిర్వ‌హ‌కులు బ్రోచర్లు పంపిణి చేశారు.

ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప‌రిశోధించి ప‌లు ఆధారాలు సేక‌రించారు ‘”ఇట్స్ సిక్స్‌త్ వావ్” సంస్థ స‌భ్యులు. ఈ నేప‌థ్యంలో “జై ద్వారకా క్యాంపైన్‌”లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ద్వారకను చేర్చేందుకు ఈ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో “ప్రపంచ పర్యాటక రేస్‌లైన్స్ డే” సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 17న‌ ద్వారకా స‌ముద్రం నీటిపై “జై ద్వారకా” లోగో రూపాన్ని700 మందితో రూపొందించ‌బోతున్నారు. ఈ ప్ర‌య‌త్నం గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును అందుకోబోతోంది. ఈ లోగో శ్రీ కృష్ణుని ఏడు నెమలి రెక్కలుగా, ప్రపంచంలోని 7 ప్రాచీన నాగరికతలను సూచిస్తుంది.

ఈ కార్యక్రమంలో “జై ద్వారకా క్యాంపైన్‌” నిర్వ‌హ‌కులు, “ఇట్స్ సిక్స్‌త్ వావ్” జనరల్ సెక్రటరీ రవీంద్రజిత్, క్యాంపైన్ కో ఆర్డినేటర్ కె. కోటేశ్వరరావు, క్యాంపైన్ ఎగ్జిక్యూటివ్ మోండి ప్రభు కుమార్ పాల్గొన్నారు.

 

By admin