తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టారు. అలాగే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సమేతంగా ఆయన బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారని సమాచారం.అలాగే ఏపీ, తెలంగాణ మధ్య సత్సంబంధాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా, తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మావోయిస్టు పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ‘తెలంగాణలో నిరంకుశ పాలనకు ప్రజలు స్వస్తి పలికారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలకు నిధులు ఎలా సమకూర్చుతారు? నిత్యాసరాల ధరలు, పన్నులు పెంచితే ప్రజలు సహించరు’ అంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. మరి దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *