భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , రేవంత్ రెడ్డి పిలుపు మేరకు
చిగురుమామిడి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారి పై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ,రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఏ ప్రభుత్వానికి లేదని ,రాజ్యాంగాన్నీ మార్చాలన్న సీఎం కేసీఆర్ ప్రకటనవెనుక,ఏదో మతలబు ఉందని వెల్లడించారు రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, నాటి యుపీఎ ప్రభుత్వ హాయంలో సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పడిందని రాజ్యాంగం వల్లే నేడు కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారని ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టు మల్లరవీందర్ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎస్సీ సెల్ అధ్యక్షులు దొబ్బల బిక్షపతి మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబుద్దీన్ చిగురుమామిడి గ్రామ శాఖ అధ్యక్షులు పూల లచ్చిరెడ్డి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మిట్టపల్లి ఆదర్శ్ గట్టు ప్రశాంత్ బోయిని వేణు ఠాగూర్ నరేంద్ర సింగ్ భగవాన్ సింగ్, భగవాన్, పోలు శ్రీనివాస్ సునీల్ ప్రవీణ్ కొమురయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులుప్రసాద్ అభిమానులు ఉన్నారు.