దక్షిణాఫ్రికా: టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ త‌మ మంచి మ‌న‌సును చాటుకుంటోంది. ప్రతి సంవత్సరం చలికాలంలో సౌత్ ఆఫ్రికాలోని పలు ప్రదేశాలలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నది. కాగా, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా జోహాన్స్‌ బర్గ్‌లోని మిడ్రాండ్‌ పోలీస్ శాఖతో కలిసి దుప్పట్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, హరీశ్‌ రంగా ,విషు జై గుండా, నవదీప్ రెడ్డి, నరేష్ తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమానికి సీఎం కేసీఆరే స్ఫూర్తి అన్నారు.

సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు సేవ చేస్తున్నారు. అదే పంథాలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ ద్వారా తమకు తోచిన వింధంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మిడ్రాండ్‌ పోలీస్ శాఖ స్పోక్స్ పర్సన్ మబులానే మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ ఎన్నో రకాల కమ్యూనిటీ సర్వీసెస్ ని నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖకు సౌత్ ఆఫ్రికా పోలీస్ తరపున ధన్యవాదాలు తెలిపారు.

By admin