జెడ్డా: దీపావళి వేడుకలతో జెడ్డాలోని భారత కాన్సులేట్ వెలిగిపోయింది. భారతీయ సంస్కృతి, దీపావళి స్ఫూర్తిని జరుపుకునే సాంస్కృతిక ప్రదర్శనల అంద‌మైన దృశ్యాల‌ను ఆవిష్క‌రించారు. మంత్రముగ్దులను చేసే క్లాసిక్ నృత్యాల నుండి గుడ్ హోప్, ఫినోమ్ అకాడమీల ఆకర్షణీయమైన సినిమా ప్రదర్శనలు గొప్ప వారసత్వం, సంస్కృతికి ఉదాహరణగా నిలవడంతో పాటు, జెడ్డాలోని భారతీయ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, ఐక్యత, స్నేహ భావాన్ని పెంపొందించాయి.

సాంప్రదాయ దీపం వెలిగించి డీప్ డాన్ ఓ అందమైన స్వరాన్ని అందించ‌డంతో ఆధ్యాత్మిక ప‌రిమ‌ళం వెద‌జ‌ల్లింది. ఈ వేడుక‌లో కీలక కమ్యూనిటీ సభ్యుల అవార్డుల ప్రధానం ద్వారా అత్యుత్తమ సహకారాన్ని గుర్తించి సత్కరించింది. సాటా, గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజింగ్ కమిటీలో శాంతి మల్లెశన్, సుభాన్, కెవిన్, స్నేహ, అరుణ్, జయశంకర్, సుదామా, పరాగ్, ప్రణేష్, ఓం ప్రకాష్, భాస్వతి, దేబాసిస్, అంకిత్, కార్తీక్, రేవతి, శ్రీతా, నమితా, లక్ష్మీరాజ్, గణేష్ లింగ, కవితా, విశాల్, మృత్యుంజయ, ప్రశాంత్, బాద్షా, ముబీన్, సంతోష్, హిరంబా, నాగరాజ్, ఉజ్వల, వంచా ఉన్నారు. దీనికి డాక్టర్ అలోక్ తివారీ నాయకత్వం వహించారు.

భిన్నత్వంలో వైవిధ్యంలో ఏకత్వాన్ని ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ గ్లోబల్ ఇండియన్ మిడిల్ ఈస్ట్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్, సాటా ఫౌందర్ మ‌ల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు.

 

BREAKING NOW APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKING NOW
BREAKING NOW

GTA వేదిక‌పై ఎన్నారైల‌కు ‘స్వ‌దేశం’ ప‌రిచ‌య కార్య‌క్ర‌మం

 

 

By admin