మలయాళంలో మోహాన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా దృశ్యం. తెలుగులోకి అదే పేరుతో రీమేక్ అయ్యి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. మలయాళంలో మోహన్‌లాల్ హీరో అయితే.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ వెర్షన్‌ను మించి తెలుగు రీమేక్ ను ఆద‌రించారు ప్రేక్షకులు. ఇక తెలుగు వెర్షన్ హిట్ అయిన తరువాత అటు హిందీలోను.. ఇటు తమిళంలోను ఈ సినిమా తెరకెక్కి హిట్ అయింది. ఇక దృశ్యం సినిమాకి వరుసగా సక్సెస్ అందుతుండటంతో.. ఈ సినిమాకు సంబంధించి మూడో సినిమా త్వరలో రాబోతోంది. దృశ్యం-3 ( drishyam-3 ) పేరుతో సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. సన్నాహాలు కూడా చేస్తున్నారు. సినిమా కోసం థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లో కథ కూడా రెడీ చేశారు. ‘దృశ్యం 3’ చిత్రానికి రంగం సిద్ధమవుతున్న‌ట్టు ఆశీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోనీ పెరుంబావూర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఫ్రాంచైజీలో ఇదే చివ‌రి చిత్రం. ‘దృశ్యం 3’ కంక్లూజన్ గా పోస్టర్ లో మెన్షన్ చేశారు మేకర్స్.

జార్జ్ కుట్టి అనే ఓ మధ్యతరగతి కేబుల్ ఆపరేటర్.. భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. అంతలో ఆ కుటుంబానికి వరుణ్ హత్యకేసు రూపంలో కష్టాలు ఎదురవుతాయి. ఆ పరిస్థితుల్లో జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అన్నదే కథాంశం. ఇదే సినిమాను అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ రీమేక్ చేయగా.. అక్కడ కూడా సూపర్ హిట్ సాధించింది. అలాగే ఇదే సినిమాను చైనీస్, సింహళ, ఇండోనేషియన్ భాషల్లో సైతం రీమేక్ చేశారు. ఆయా భాషల్లోనూ సినిమాకి మంచి స్పందన దక్కింది. దాంతో ఈ సినిమాకి రెండో భాగాన్ని ప్రకటించి 2020లో ఓటీటీలో విడుదల చేశారు. మొదటి భాగాన్ని మించి చిత్రం సూపర్ హిట్ అయింది. తెలుగు, కన్నడ భాషల్లో కూడా చిత్రం రీమేక్ అయింది. రెండు భాషల్లోనూ ‘దృశ్యం 2’ అద్భుత విజయం సాధించింది. వరుణ్ హత్యకేసును ఆరేళ్ళ తర్వాత తిరగతోడడంతో జార్జ్ కుట్టి కుటుంబానికి మళ్ళీ కష్టాలెదురవుతాయి. ఈ సారి జార్జ్ కుట్టి ఇంకెంత తెలివిగా తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు అన్నదే కథాంశం. దర్శకుడు జీతుజోసెఫ్ అద్భుతమైన కథాకథనాలతో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక ఇప్పుడు ‘దృశ్యం’ చిత్రానికి మూడో భాగం తీయడానికి జీతు జోసెఫ్ రెడీ అవుతున్నాడు. రెండో భాగం సూపర్ హిట్టయిన సందర్భంలో మూడో భాగానికి మంచి ఐడియా ఎప్పుడు తడుతుందో అప్పుడే సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలిపాడు దర్శకుడు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. మరో అద్భుతమైన కథాంశంతో మూడో భాగం తెరకెక్కనుందని సమాచారం. వరుణ్ హత్య కేసు నుంచి మరోసారి తెలివిగా తప్పించుకొని.. అతడి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశను కలిగించిన జార్జ్ కుట్టికి మరోసారి ఇదే కేసు విషయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మూడో భాగం కథాంశం. సో.. మరోసారి జార్జ్ కుట్టికి ప్రభాకర్, గీతా దంపతుల నుంచి కష్టాలు తప్పవన్నమాట. ప్రస్తుతం మోహన్ లాల్ తో ‘రామ్’ మొదటి భాగాన్ని తెరకెక్కిస్తున్న జీతు జోసెఫ్.. అది పూర్తవగానే దృశ్యం 3 ను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. మరి తెలుగులో కూడా ‘దృశ్యం 3’ వ‌స్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం ఈ వీడియో కింద‌ కామెంట్ చేయండి.

By admin