దుబాయ్: రంగురంగుల పువ్వుల కోక కట్టుకొని అభయమివ్వడానికి వచ్చిన ప్రకృతి మాత బతుకమ్మ. బతకడానికి కావలసినంత భరోసాని ఎదనిండా నింపే అమ్మ బతుకమ్మ. ఆ అమ్మను కనులారా చూసుకొని, కమనీయంగా పాడుకొని, సిరిసంపదలు, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుకునే అతివలకు కొంగుబంగారం బతుకమ్మ. మన బతుకమ్మ పండుగ ఊరు వాడ పల్లెలు పట్టణాలు దాటి గ‌ల్ఫ్ దేశాల‌కూ చేరింది. దుబాయ్ లో పూల జాత‌ర ఘ‌నంగా జ‌రిగింది. గల్ఫ్ తెలంగాణా ఫోరమ్(GTF) అధ్యకులు ఆకుల సురేందర్, యూజువేందర్, వెంకటేష్, జగన్, రాజేశ్వర్, సురేష్, సుఫియాన్ అధ్వ‌ర్యంలో, దుబాయ్ లోని ఆల్ మాం జార్ టేబుల్ టెన్నిస్ అకాడమీ మన బతుకమ్మ పండుగ కు వేదిక అయింది. ఆ ప్రాంగ‌ణ‌మంతా బతుకమ్మ ఆట పాటలతో మారుమోగింది. తెలంగాణా ఆడబిడ్డలు అక్కా చెల్లెళ్లు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ ఆట పాటలతో ఆడి, పాడి సందడి చేశారు.

ఈ కార్యక్రమం లో గల్ఫ్ తెలంగాణా ఫోరమ్ మహిళా సభ్యులు ప్రత్యేకంగా ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుక‌ల్లో మ్యూజికల్ లైవ్ ఫోక్ సింగింగ్ పెరఫార్మెన్, ఇంకా డీజే చప్పుళ్లతో బతుకమ్మ ప్రాంగణం వేలాదిగా తరలివచ్చిన తెలుగు జనంతో కోలాహలంగా మారింది.

ఈ కార్యక్రమంలో మై విలేజ్ షో గంగవ్వ టీమ్, తెలంగాణా నుండి నృత్య కళాకారులు, గాయకులు ప్రత్యేక అతిధులు గా వచ్చి అలరించారు. కార్యక్రమానికి యుఏఈ లోని అన్ని ప్రాంతాల నుండి ప్ర‌వాస తెలంగాణ వారు ఎనిమిది వేల మంది తరలి వచ్చారు. భారీగా జ‌రిగిన ఈ వేడుక‌లు దిగ్విజయం అవ్వ‌డానికి పాటుపడిన ప్రతీ ఒక్కరికీ గల్ఫ్ తెలంగాణా ఫోరమ్ అధ్యక్షులు ఆకుల సురేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://shorturl.at/mxEGU

BREAKINGNEWS TV

      • BREAKINGNEWS TV

      

     ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

     ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

     ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

     • BREAKINGNEWS TV

     https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

     BREAKINGNEWS TV & APP

     BREAKINGNEWS APP
     Breaking News APP
     https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

   

By admin