విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన అప్‌క‌మింగ్ మూవీ ”F 3”. 2019లో సూప‌ర్ హిట్ సాధించిన ‘ఎఫ్ 2’ ఫన్ ఫ్రాంచైజీలో రూపొందించిన మూవీ. సమ్మర్ స్పెషల్ గా మే 27న ఈ వినోదాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ”ఎఫ్ 3” ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. 2 నిమిషాల 32 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్మెంట్ అందిస్తోంది. ‘ఎఫ్ 2’ లో క్యారెక్టరైజేషన్లతో కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కిందని అర్థం అవుతుంది. అక్కడ భార్యాభర్తల కథకు ఫన్ – ఫస్ర్టేషన్ కలిపి చూపిస్తే.. F3 కథ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.

అనిల్ రావిపూడి తనదైన రైటింగ్ అండ్ టేకింగ్ తో దీన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందించారని ట్రైలర్ బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. యాక్ట‌ర్స్ ఆండ్ టెక్నిషియ‌న్స్ ఈ మూవీ కంటెంట్ ని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లారు. ఇందులో వెంకటేష్ రేచీకటి బాధితుడిగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్నత్తితో మాట్లాడే యువకుడిగా కనిపించి ఆధ్యంతం నవ్వులు పూయించారు. తమన్నా భాటియా మరియు మెహ్రీన్ ఇద్దరూ ట్రెడిషనల్ అండ్ గ్లామర్ అవతార్ లలో అద్భుతంగా కనిపిస్తారు. ఇందులో సోనాల్ చౌహాన్ – సునీల్ కీలక పాత్రల్లో కనిపించగా.. వెన్నెల కిషోర్ పాన్ ఇండియా జూనియర్ ఆర్టిస్టుగా అలరించాడు. రాజేంద్ర ప్రసాద్ – మురళీ శర్మ – రఘుబాబు – శ్రీకాంత్ అయ్యంగార్ – పృథ్వీరాజ్ – ప్రగతి వంటి భారీ తారాగణం ఇందులో కనిపించారు. మధ్యతరగతి ప్రజల డ్రీమ్స్ ఆధారంగా హాస్యభరితంగా ”ఎఫ్ 3” చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఫన్ ఎంటర్టైనర్లను హ్యాండిల్ చేయడంలో అనిల్ రావిపూడి మరోసారి తన నైపుణ్యాన్ని చూపించాడు. వెంకీ – వరుణ్ లను హైలెరియస్ రోల్స్ లో ప్రెజెంట్ చేశారు. ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది.

టెక్నికల్ టీమ్ వర్క్ విషయానికి వస్తే సాయి శ్రీరామ్ కెమెరా పనితనం డిఫరెంట్ గా ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో వినోదాన్ని పెంచాడు. మొత్తం మీద F3 ట్రైలర్ అన్ని వినోదాత్మక అంశాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. మే 27న సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తుందని గ్యారెంటీ ఇస్తోంది.

By admin