▪️ భార‌త్‌లో ప‌లు చోట్ల కావేటి లా ఫర్మ్ శాఖలు
▪️ విదేశాల‌కు వెళ్లేవారికి న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు, సేవ‌లు
▪️ కావేటి లా ఫర్మ్ ప్రధాన కేంద్రంగా న్యూయార్క్
▪️ న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయం
▪️ హైదరాబాద్‌లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయం
▪️ వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో నూత‌న‌ శాఖలు ప్రారంభం
▪️ కావేటి శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో కావేటి లా ఫర్మ్ విస్త‌ర‌ణ‌

విజ‌య‌వాడ‌: విదేశాల‌కు వెళ్లే భార‌తీయుల‌కు న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు, సేవ‌లు అందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది, అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా గల కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ భార‌త్‌లో తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్ సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో విజయవాడలోని బందరు రోడ్డులో తమ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాన్ని, అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ లా నిపుణుడు విక్ గాప్నీ,చెన్నుపాటి శ్రీనివాస్, ఎఫ్‌సీ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అభినాష్, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ బెల్లంకొండ వినోద్, ఆంధ్ర, తెలంగాణా హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు, బి. ప్రసాదరావు, చెన్నుపాటి శుభాకర్, బొమ్మిన కళ్యాణి తదితరులతో కలిసి ప్రారంభించారు.

ఇటీవల సుప్రీం కోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీసు చేసుకోవచ్చు అని నిర్ణయించినందువలన, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని, హైదరాబాద్ లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు కావేటి శ్రీనివాస్ తెలిపారు.

ఏప్రిల్ 28వ తేదీన గుంటూరులోను, 29 న తిరుపతిలోను కూడా తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఎఫ్ సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అభినాష్ తెలిపారు.

తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోని భారతీయులందరికీ, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని కావేటి లా ఇండియన్ ఆపరేషన్స్ అధిపతి, అంతర్జాతీయఇమ్మిగ్రేషన్ లా నిపుణుడు విక్ గాప్నీ తెలిపారు.

విదేశాలకు వెళ్లేముందు, విదేశాలకు వెళ్లాలనుకునేవారికి, ఆయా దేశాల్లో ప్రవేశించాక, అక్కడ ఎటువంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా, ఎలా నడుచుకోవాలో ప్రతినెలా, ఒక రోజు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు తెలిపారు.

కార్పొరేట్ లా, స్ట్రాటజిక్ ప్లానింగ్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ జూరిస్డి క్షషనల్ ఇష్యూస్, ఫ్యామిలీ వివాదాలు, ట్రేడ్ మార్క్ పేటెంట్స్, హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ చట్టాలు తదితర అనేక అంశాల్లో లా ప్రాక్టీస్ ఉన్నట్లు కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ తెలిపారు. వీసా, గ్రీన్ కార్డ్, రెసిడెన్సి పర్మిట్స్, సిటిజన్షిప్, ఎంప్లాయ్మెంట్ ఇన్వెస్ట్మెంట్, విద్యార్థి వీసా విభాగాల్లో కావేటీలకు స్పెషలైజేషన్ ఉన్నట్లు తెలిపారు. ఎన్నారైలకు కాంట్రాక్టు వివాదాలు, ప్రాపర్టీ చట్టాలు, కంపెనీలో ఏర్పాటు వంటి అంశాల్లో న్యాయ సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్, ఇతర లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి.. న్యాయ సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యాయవాది డాక్టర్ విక్ గాఫ్ని ఇండియా తో పాటు దక్షిణాసియాలో కావేటి లాఫార్మ్ అందించే సేవలో కీలక భాగస్వామిగా ఉన్నట్లు చెప్పారు.

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

 

By admin