▪️ ఆంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుప‌ర్చే ల‌క్ష్యం
▪️ ఆల్బ‌నీ ఆంధ్ర అసోసియేష‌న్ (AAA) మాన‌వ‌త్వం
▪️ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉచిత మెడిక‌ల్ క్యాంపు

  • విజ‌య‌న‌గ‌రం, న్యూయార్క్ (మీడియాబాస్ నెట్‌వ‌ర్క్):

జననీ జన్మ భూమిశ్చ. దేశభక్తి అంటే జన్మభూమితో భూమి పుత్రుడికి ఉండే దైవికమైన అనుబంధం. తాము జ‌న్మించిన‌ గ‌డ్డ‌పై అందరూ బాగుండాలన్న తాపత్రయం. కనీ,పెంచీ, విద్యాబుద్ధులు నేర్పించిన జ‌న్మ‌భూమి రుణం తీర్చుకుంటున్నారు న్యూయార్క్‌కు చెందిన ‘ఆల్బ‌నీ ఆంధ్ర అసోసియేష‌న్ (AAA)’ స‌భ్యులు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ మాన‌వ‌త్వం నిరూపించుకుంటున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల జీవితాల‌ను మెరుగుపర్చే కార్య‌క్ర‌మాల్లో భాగంగా తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వినికిడి లోపం గ‌ల చిన్నారుల‌కు ఆల్బ‌నీ ఆంధ్ర అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెడిక‌ల్ క్యాంపు నిర్వ‌హించారు.

అయ్య‌కోనేరు ఉత్త‌ర గ‌ట్టు వ‌ద్ద గ‌ల గాయ‌త్రి హ‌స్పిట‌ల్‌లో 5 ఏళ్ల లోపు వినికిడి లోపం గ‌ల చిన్నారుల‌కు ఉచిత వినికిడి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఎస్టీ క‌మీష‌న్ చైర్మ‌న్ డివీజీ శంక‌ర్‌రావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అవ‌స‌ర‌మైన వారికి రూ. 10 ల‌క్ష‌లు విలువ గ‌ల శ‌స్త్ర చికిత్స‌ల‌ను ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు.

ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. గాయ‌త్రి హాస్పిట‌ల్ ఎండీ డా. జీబీ వెంక‌ట్ మాట్లాడుతూ.. పుట్టుక‌తో చెవిటి, మూగ పిల్ల‌ల‌కు, సంప్ర‌దాయ వినికిడి మిష‌న్‌తో ప్ర‌యోజ‌నం పొంద‌లేని పిల్ల‌ల‌కు ఈ కోక్లియ‌ర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ద్వారా వినికిడితో పాటు స్ప‌ష్టంగా మాట్లాడే అవ‌కాశం క‌లుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్ మెంట‌ర్ స‌ర్జ‌న్ డా. కృష్ణ కిషోర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

స్వదేశంలోని అవసరమైన వారికి సహాయం చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం త‌మ అసోసియేష‌న్ అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంద‌ని ఆల్బ‌నీ ఆంధ్ర అసోసియేష‌న్ అధ్య‌క్షుడు విద్యారణ్య గుజ్జు ఈ సంద‌ర్భంగా తెలిపారు.మెడికల్ క్యాంపు ప్రారంభం నుంచి కీ రోల్ ప్లే చేశారు కిషోర్ కుప్పిరెడ్డి అంతేకాకుండా దానిని ఎంతోమంది వినియోగించుకునేలా చేయడం లోఅయన సక్సెస్ అయ్యారు .ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎంపీ డా. శంకర్ రావు, సూర్యారావు కుప్పిరెడ్డి, సూర్యనారాయణరావు ఆదిరెడ్డి, సుధాకర్ నాయుడు ఆదిరెడ్డి , శ్రీనివాసరావు ఆదిరెడ్డి, ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల), త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://breakingnewstv.co.in/mobileapp/

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link   https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

By admin