గజ్వేల్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) గజ్వేల్ ఆధ్వర్యంలో, గజ్వేల్ లయన్స్ మెంబెర్స్ సహకారంతో, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి నేతృత్వంలో మెగా వైద్య శిభిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో గజ్వేల్ ప్రముఖ వైద్యులతో పాటు యశోదా హాస్పిటల్, హైదరాబాద్ ప్రముఖ డాక్టర్లతో గుండె పరీక్ష, ECG, షుగర్, బీపీ, రక్త పరీక్షలు నిర్వహించి అవసరం అయిన వారికి ఉచితంగా మందులు అందించారు.

ఈ సంద‌ర్భంగా ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా వేడుకలు చైర్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంతా ఆరోగ్యంగా ఉండాల‌నే లక్ష్యంతో హెల్త్ క్యాంపు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. ఇక్క‌డికి వ‌చ్చిన రెండు వేల మంది పేషెంట్ల‌కు 40 మంది డాక్ట‌ర్లు, 100 మంది వాలింట‌ర్లతో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించమ‌న్నారు. ప‌లు ర‌కాల ఆరోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న పేషెంట్ల కోసం జనరల్ ఫిజిషియన్, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, డెంటల్, ఒథోపెడిక్స్, గైనకాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్స్, స్కిన్ డాక్టర్, రక్త పరీక్షలు, సాధారణ శస్త్రచికిత్స వంటి వాటికి ఉచిత స్క్రీనింగ్ చేస్తూ, ఉచిత మందులు పంపిణి చేశామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ‘ఆటా’ బోర్డు సభ్యులు నర్సింహ ద్యాసాని, సాయి సుదిని, కాశీ కోట, రవీందర్ గూడూరు, శ్రీధర్ కాంచనకుంట్ల, కోశాధికారి సతీష్ రెడ్డి, పూర్వ‌ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, ‘ఆటా’ వ్యవస్థాపక సభ్యుడు హనుమంత్ రెడ్డి, ఇతర అటా సభ్యులు, వేణు నక్షత్రం, నర్సింహ వడియాల, శ్రీనివాస్ రామానుజ, అమృత్ ముళ్లపూడి, తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ (TDF) పూర్వ అధ్యక్షురాలు కవిత చల్లా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గజ్వేల్ లయన్స్ స‌భ్యులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపుకు వచ్చిన వారందరికీ  మధ్యాహ్న భోజనం అందించారు.

 

 

By admin