పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానం మూగబోయింది.. పేదోళ్ల రాజ్యం కోసం పోరాడిన పోరాట గీతం ఆగిపోయింది.. పోరాట పాటకు.. పర్యాయ పదం.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు విన్నా.. పలికినా.. నరాలు ఉప్పొంగుతాయ్.. రోమాలు నిక్కబొడుచుకుంటాయ్.. ఉద్యమ పాటకు ఊపిరిలూదారు.. తెలంగాణ కోసం గ‌ద్ద‌ర్ గ‌జ్జెక‌ట్టి చిందేస్తూ ప‌దం పాడితే రాష్ట్ర‌మంతా త‌న్మ‌య‌త్వంతో రుద్ర నాట్యం చేసింది. ప‌ల్లె ప‌ల్లెకు, ప్ర‌తి ఒక్క‌రిని త‌న ఆట‌పాట‌ల‌తో క‌దిలించిన ఉద్య‌మ శ‌క్తి నిరంత‌రం వెలుగుతూనే ఉంటుంది. ఆయ‌న‌కు నివాళి అర్పిస్తోంది బ్రేకింగ్‌న్యూస్ టీవీ & యాప్.

తుపాకీ తూటల్లాంటి మాటలతో, ప్రవాహం లాంటి పాటలతో యువ‌త‌ను ఉద్యమబాట పట్టించిన గ‌ద్ద‌ర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించాడు. గ‌ద్ద‌ర్ అస‌లు పేరు గుమ్మడి విఠల్ రావు. గ‌ద్ద‌ర్ వెలువ‌రించిన మొదటి ఆల్బం పేరు గద్దర్. దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా త‌న పేరు స్థిర‌ప‌డింది.

ఇంజనీరింగ్ విద్య వ‌ర‌కు సాగిన ఆయన విధ్యాభ్యాసం హైదరాబాద్ లో ముగిసింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” రాశాడు.

కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథ‌లను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ రాసారు. అయన కెనరా బ్యాంకులో క్లర్క్ గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల.

మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను గ‌ద్ద‌ర్ పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.

మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేశారు. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

1997 ఏప్రిల్ 6 న ఆయనపై ఆగంత‌కులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావు లను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్‌కౌంటర్ లను వారు తీవ్రంగా నిరసించారు.

గ‌ద్ద‌ర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించారు.

మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. “అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా” అనే పాటను “తెలంగాణా” రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు.

ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ గ‌జ్జెక‌ట్టి చిందేస్తూ ప‌దం పాడితే తెలంగాణ అంతా త‌న్మ‌య‌త్వంతో రుద్ర నాట్యం చేసింది. ద‌శాబ్దాలుగా ఎర్ర‌దండుకు, ప్ర‌జానాట్య‌మండ‌లికి, విర‌సంకు ఆయ‌న చేసిన సేవ‌లు అనిర్వ‌చ‌నీయం. గ‌ద్ద‌ర్ బండెన‌క‌బండి క‌ట్టి ఏ బండ్లె పోత‌వు కొడ‌కొ అంటే ఉభ‌య రాష్ట్రాల్లోని ఉద్య‌మవాదులంతా ఉర‌క‌లెత్తిన‌ ఉత్సాహంతో క‌ద‌న రంగంలోకి దూకి ఉద్య‌మ బాట ప‌ట్టారు అదీ గ‌ద్ద‌ర్ గ‌ళానికున్న ప్ర‌త్యేక‌త‌. తెలంగాణ ఉద్య‌మం కోసం ఆయ‌న రాసి ఆల‌పించిన `పొడుస్తున్న పొద్దుమీద న‌డుస్తున్న కాల‌మా పోరు తెలంగాణ‌మా` పాట రోమాంచితంగా సాగి ఉద్య‌మాన్ని ఉదృతం చేయ‌డంలోనూ భావోద్వేగాల్ని ప‌తాక స్థాయికి చేర్చ‌డంలోనూ ప్ర‌ధాన భూమిక పోషించింది.

తెలంగాణ కోసం గ‌జ్జెకట్టి, ప‌ల్లె ప‌ల్లెకు, ప్ర‌తి ఒక్క‌రిని త‌న ఆట‌పాట‌ల‌తో క‌దిలించిన ఉద్య‌మ శ‌క్తి గ‌ద్ద‌ర్ ఇక లేరు. ఆయ‌న భౌతికంగా మన మ‌ధ్య లేక‌పోయినా ఆయ‌న ఆట‌పాట‌లు ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో శాశ్వ‌తంగా ఉండిపోతాయి.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

  • HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

 

By admin