ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం
మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారి..
వివిష్ట సేవలు అందించిన వారికి అవార్డుల ప్రధానం…

సంచికలు సమాచారం సేకరణ లో, విషయ విషదికరణ లో కీలక పాత్ర పోషిస్తాయని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అన్నారు. ముంబయ్ రాజ్ భవన్ లో తెలుగు సంచిక ప్రజా డైరీ మాతృ దినోత్సవ సంచిక విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా భగత్ కోశ్యారి మాట్లాడుతూ సమాచార సేకరణ, విషయ విశదీకరణ లో సంచికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తాను సంచికల్ని చదవ డానికే ఎక్కువ ఆసక్తి చూపుతానని, ఇందులో ఎక్కువ సమాచారం ఉంటుందన్నారు. తెలుగు సంచిక ప్రజా డైరీ తెలుగు పత్రిక రంగం లో దూసుకు పోతుందని కితాబిచ్చారు. మాతృ దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యడం అభినందనీయం అన్నారు. ఈ సంచికను ప్రధాని మోడీ, మోడీ తల్లి హీరాబెన్ కు అంకితం చేశారు.

అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. సమాజంలో అవసరం అయిన అన్ని వర్గాల విశిష్ట సేవలు అందించినందుకు గాను మనం ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ కుమార్ ను సత్కరించారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ కుమార్ మాట్లాడుతూ తనకు ఈ గౌరవం లభించడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా సేవలు అందించడానికి ఇది ఉత్సాహాన్నిస్తుంది అని త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ఈ సేవా పురస్కారాన్ని మనం ఫౌండేషన్” కి ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్న అమెరికా ప్రతినిధులు కాసర్ల శ్రీని, తపస్వి రెడ్డి, తాటిపల్లి ప్రవీణ్, జై, దుబాయ్ సుజాత రాంచందర్ రెడ్డి, ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి కుమార్ అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రిక ఎడిటర్ ప్రజా డైరీ సురేష్ తిరుమల బ్యాంకు చైర్మన్ ఎం చంద్రశేఖర్, విజయ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, పారిశ్రామికవేత్త ఆనంద్ చోర్డియా, న్యాయవాది మహేష్ బాబు గౌడ్, కళాకారుడు తుపాకుల మహేష్, శ్రీలత కుమార్, పోతు రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

 

By admin