◉ ఆసియా-గల్ఫ్ దేశాల సమావేశంలో మంద భీంరెడ్డి

కౌలాలంపూర్: వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి కి రియాక్టర్ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒకనెల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉద్యోగ ఒప్పందాలలో ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. గల్ఫ్ కార్మికులు స్వదేశంలో కుటుంబంతో జీవించే హక్కును కాపాడాలని ఆయన కోరారు. అంతర్జాతీయ వలస కార్మికులకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నదని వచ్చే సంవత్సరం భారత్, ఇండోనేషియా, బాంగ్లాదేశ్ లలో జరిగే జాతీయ ఎన్నికలలో ప్రవాసుల ప్రభావం ఉంటుందని భీంరెడ్డి అన్నారు.

ఫిలిప్పీన్ కేంద్రంగా పనిచేసే మైగ్రెంట్ ఫోరమ్ ఇన్ ఏసియా అనే సంస్థ నిర్వహించిన ఆగ్నేయ ఆసియా, దక్షిణ ఆసియా, గల్ఫ్ మధ్యప్రాచ్య దేశాల ప్రతినిధుల సమావేశాన్ని ఈనెల 24, 25 రెండు రోజులు పాటు జరిగింది. లెబనాన్ రాజధాని బీరుట్ లో ఉన్న అరబ్ దేశాల ఐఎల్ఓ (అంతర్జాతీయ కార్మిక సంఘం) ప్రాంతీయ కార్యాలయం సోషల్ ప్రొటెక్షన్ టెక్నికల్ ఆఫీసర్ డా.  లియాబూ కాటర్ వలస కార్మికుల సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్), సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ), విశ్వవ్యాప్త సామాజిక రక్షణ అంతస్తులు (యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ప్లోర్స్) అంటే ఏమిటి? ఎందుకు? అనే విషయంపై వివరణాత్మకంగా ప్రసంగించారు. డా. రేణు అధికారి (నేపాల్), ఫిష్ ఐపి (ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్), విలియమ్స్ (ఫిలిప్పీన్స్) లు వివిధ దేశాలలో ఉన్న సామాజిక రక్షణ పథకాల గురించి వివరించారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link

https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

By admin