హైదరాబాద్ (మీడియాబాస్ నెట్‌వర్క్): మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఉగాది పండగను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేసిన వారిని ఎంపిక చేసి ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ మరియు కెకెఆర్ బ్రాడ్ కాస్టింగ్ మీడియా హౌజ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియం లో హర్యానా గవర్నర్ బండారి దత్తత్రేయ చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేశారు. ఆర్ఎస్ కుమార్ చేసిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. బోధన్ మండలం పెంటాకాలాన్ గ్రామానికి చెందిన కుమర్ గత కొన్నేళ్లుగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మనం ఫౌండేషన్‌లో పలువురు అనాథ చిన్నారులకు చేయుతనందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు,జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
మరింత బాధ్యతను పెంచింది: ఆర్ఎస్ కుమార్
“క్షణం తీరిక లేకుండా, మంచి పనులలో నిమగ్నమై ఉండేవారు,నిత్యం సంతోషంగా ఉంటారు అని నమ్మి, తాము మనం ఫౌండేషన్ ద్వారా నలుగురికి సేవ, సహాయం చేస్తూ పదిమందికి ఉపయోగపడే పనులు చేసి మనుషుల మనసులు గెలవటం మా మనం ఫౌండేషన్ అదృష్టం” అని ఈ సందర్భంగా కుమార్ అన్నారు. “ఎదుటి వాళ్ళ సంతోషం కోసం మనం ఫౌండేషన్ చేసే సేవ , సహాయ కార్యక్రమాలు ఎంతో ఆనందాన్ని, ఊరటనిస్తాయి. అలాంటి సేవ కార్యకమాలకు గాను మరొక్కసారి ఈ సేవా పురస్కారాన్ని ఉగాది కానుకగా అవార్డు పొందడం, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషాన్ని కల్గిస్తుంది.. అలాగే మరింత బాధ్యతను పెంచింది..” అని కుమార్ అన్నారు. ఈ సేవా పురస్కార్ అవార్డును అమెరికా మనం ఫౌండేషన్ ప్రతినిధులకు, ఎప్పుడూ వెన్నంటి ఉండి నడిపించే మనం ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి అంకితమిస్తున్నట్టు తెలిపారు.