దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన త్రిపులార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమా ఎలా సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓవర్‌సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్‌ సంధు సినిమా రిలీజ్‌కు ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ చూసేశానంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. సినిమాకు ఏకంగా ఐదు స్టార్ల రేటింగ్‌ ఇచ్చాడు.

‘భారతీయ సినిమా పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవచ్చని నిరూపించిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రాన్ని ఎవరూ మిస్‌ కాకుండా చూసి తీరాల్సిందే! ఇప్పుడు దీన్ని బ్లాక్‌బస్టర్‌ అని చెప్పుకున్నా రేపటి తరానికి మాత్రం ఇదొక క్లాసిక్‌గా మిగిలిపోతుంది. చరణ్‌, ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించారు. వారి కాంబినేషన్‌ అదిరింది. అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజీలా కనిపిస్తాడు. ఆలియా భట్‌ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది’ అని ఉమైర్‌ సంధు ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ చిత్రంతో రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వ‌న్ డైరెక్టర్‌గా మారిపోతాడంటూ ఉమైర్‌ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తూ మరో ట్వీట్‌ చేశాడు.

ఎన్టీఆర్ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడని.. రామ్ చరణ్ టెరిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఓ రేంజ్ లో ఉందని చెప్పారు. ఇదొక డెడ్లీ కాంబినేషన్ అని అన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అని ఈరోజే చెప్పొచ్చని.. విడుదలైన తరువాత మాత్రం ఒక ‘క్లాసిక్’ గా అందరికీ గుర్తుండిపోతుందని అన్నారు. ఇలా సినిమా గురించి పాజిటివ్ గా ట్వీట్స్ వేస్తూనే ఉన్నాడు. అయితే నెటిజన్లు మాత్రం ఉమైర్ సంధుని టార్గెట్ చేశారు. సినిమా సెన్సార్ డిసెంబర్ లోనే అయిపోయిందని.. నువ్ ఇప్పుడే నిద్ర లేచావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉమైర్ సంధు ఒక ఫేక్ పర్సన్ అని.. అతడి ట్విట్టర్ అకౌంట్ ని రిపోర్ట్ చేయాలంటూ చర్చలు పెడుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ వస్తున్నా.. ఉమైర్ మాత్రం ట్వీట్స్ వేయడం ఆపలేదు.

HyStar APPలో మీరూ మీ Profile క్రియేట్ చేసుకొండి సినిమా ఛాన్స్ – మీడియా అవ‌కాశాలు అందుకొండి.. HyStar APP Google play store link: https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar website link: www.hystar.in

By admin