ఫుడ్డు సూప‌ర్ టేస్టీ ఉంటే లొట్ట‌లేసుకుంటూ తింటారు ఎవ‌రైనా. మ‌రి అలా టేస్టీ వండ‌టం అంద‌రికీ రాదు. ఈ రోజుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. కుకింగ్ వీడియోలు చూస్తూ ఎవ‌రైనా అలాంటి టేస్టీ వంట‌కాలు చేసుకోవ‌చ్చు. కొత్తగా పెళ్ల‌యిన వారు, గృహిణులు, బ్యాచిలర్స్, వంట నేర్చుకోవాల‌ని అనుకునే వారికి చ‌క్క‌టి ప‌రిష్కారం చూపుతోంది హైద‌రాబాదీ రుచులు అనే చాన‌ల్.

హైదరాబాదీ ఫుడ్ వంటకాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ల‌కి, తెలుగు (ఆంధ్రా & తెలంగాణ), భారతీయ వంటకాలపై ఆస‌క్తి చూపించేవారికి త‌న చాన‌ల్ ద్వారా చ‌క్క‌టి రుచుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు ఇందిర ఐరేని. యూట్యూబ్ స్టార్ ఇందిర ఐరేని స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట. తల్లిదండ్రులు కళావతి, వెంకట్రాములు. భర్త అనిల్ సాఫ్టువేర్ ఇంజినీర్. ఇద్దరు పిల్లలు. ఇందిర డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ESI హాస్పిటల్ లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నది.

తీరిక సమయంలో వంటిళ్లు ఘుమ‌ఘుమ‌ల‌తో నిండిపోయేది. అమ్మ, అమ్మమ్మల నుంచి సంప్రదాయ వంటకాల గురించి తెలుసుకుని ప్ర‌య‌త్నించేది ఇందిర. ఓ రోజు సరదాగా స్పైసీ హైదరాబాద్ బిర్యానీ వండి, రెసిపీని వివరిస్తూ ఓ వీడియోను చేసి యూట్యూబ్ లో ప‌బ్లిష్ చేసింది. దీనికి మంచి వ్యూస్ వ‌చ్చాయి. ఎంత‌గా అంటే ఇంకా ఇలాంటి రుచులు పరిచయం చేయమంటూ నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో ఒత్తిడి పెరిగింది. 2016 లో ‘హైదరాబాదీ రుచులు’ పేరిట యూట్యూబ్, ఫేస్‌బుక్ లో ఛానళ్ళను ప్రారంభించింది. https://www.facebook.com/hyderabadiruchulu ఈ వేదిక మీద గత ఏడేళ్లుగా వారానికి రెండు మూడు వంటకాలను పరిచయం చేస్తూ యూట్యూబ్ స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్నది.

ఓ వైపు ఉద్యోగం బాధ్య‌త నిర్వ‌హిస్తూనే.. మంగళ, గురు, శనివారాల్లో కొత్తకొత్త‌ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వీక్ష‌కుల‌ అభిమానాన్ని పెంచుకుంటున్నారు ఇందిర. వెజ్, నాన్ వెజ్ వంట‌కాల‌తో మిలియ‌న్‌ల వ్యూస్ అందుకుంటున్నారు. Hyderabadi Ruchulu పేరిట ఉన్న‌ https://www.youtube.com/@hyderabadiruchulu/featured యూట్యూబ్ చాన‌ల్‌లోనూ హైదరాబాదీ దమ్ బిర్యానీ, స్పైసీ ఎగ్ కర్రీ, చేపల పులుసు, బగారా చికెన్ రైస్, తలకాయ కూర.. ఇలా ఎన్నో వంటకాలను పరిచయం చేసింది. పచ్చళ్లు, స్నాక్స్, స్వీట్లు, కారంపొడులు, పండుగల స్పెషల్ వంటకాల రెసిపీలనూ అందించింది. తెలంగాణ గ్రామీణ ఆహారమైన‌ రాగి జావ, అంబలి, సర్వపిండి వంటివి కూడా ప్రేక్ష‌క ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. అలా అని, ఒక్క తెలంగాణ వంటకాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ భోజనాలూ వడ్డించింది. ఇప్పటికే దాదాపు 1200కుపైగా రెసిపీలు అప్‌లోడ్ అయ్యాయి. ఈ క్ర‌మంలో పాకశాస్త్ర గురువు హోదాలో అప్పుడ‌ప్పుడు లైవ్‌లో కూడా అందుబాటులోకి వ‌స్తుంది. ఫాలోవ‌ర్స్ అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇస్తుంది. అంతేకాదు పలు పత్రికలకు కిచెన్ సైన్స్ కాలమిస్ట్ గా కూడా చేస్తోంది ఇందిర. త‌న ప్ర‌య‌త్నానికి ఫాలోవ‌ర్స్ నుంచి ఎంతో ప్రొత్సాహం ఉంద‌ని చెబుతుంది. ఇంత‌కాలం నుంచి త‌న చాన‌ల్ కొనసాగుతుందంటే దానికి కార‌ణం భ‌ర్త అనిల్, కుటుంబ స‌భ్యుల స‌హాకార‌మే అని తెలిపింది. ఇక విదేశీయులు సైతం తెలంగాణ వంటకాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు అని, సందేహాలుంటే త‌న‌ని సంప్రదిస్తున్నార‌ని ఇందిర తెలిపింది.

ఇందిర చానల్ కు యూట్యూబ్ లో 845K స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉండ‌గా, ఫేస్ బుక్ లో 561K followers ఉన్నారు. నెస్లీ, MTR, ఈస్టన్ మసాలా, కెంట్, స్పెన్సర్స్, గోల్డ్ డ్రాప్ ఆయిల్, హిమాలయ, ఫార్చ్యూన్ ఫ్రెష్ ఆటా, కంట్రీ చికెన్ తదితర కంపెనీల ఉత్పత్తులకు ఇందిర ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. భారత పర్యటనకు విచ్చేసిన దాదాపు 500 మంది విదేశీ ప్రతినిధులకు తన వంటకాలను రుచి చూపింది ఇందిర, తెలంగాణ టూరిజం నుంచి, ఏపీ ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్సర్ అవార్డును కూడా అందుకున్నది.

  • Swamy Muddam

 

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV

BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి
https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

 

 

 

 

By admin