రీడింగ్ (లండన్): హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ (HYFY London) లండన్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం ఘనంగా జరిగాయి. లండన్ కు సమీపంలో ఉన్న రీడింగ్ నగరంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.
గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున రీడింగ్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కుటుంబాలే కాకుండా స్థానిక బ్రిటిష్ వాసులు పాల్గొని, ఆట పాటలతో సంబరాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా’,’జై బోలో గణేష్ మహారాజ్ కి జై’ అంటూ వీధులు దద్దరిల్లాయి, బ్రిటన్ వాసులు కూడా తరలి వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.సంస్థ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ హైదరాబాద్ ఒక కాస్మోపాలిటన్ ప్రాంతం అని, ఎలాగైతే అక్కడ వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని ఈ వేడుకలు జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అందరికి కృతఙ్ఞతలు తెలిపారు.
6 వ రోజు గణపతి హోమం చేశారు. పూజ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డు ని జీవన్, సుమన్ గోలి, మధు గులాయిగారి కలిసి వేలం పాటలో £1500 పౌండ్స్ కి దక్కించుకోవడం జరిగింది. అనంతరం గణపయ్యకు ఘనమైన పూజలు చేసిన భక్తులు అద్భుత రీతిలో సాగనంపారు. అనంతరం థేమ్స్ నదిలో గణపయ్యలను నిమజ్జనం చేశారు.
ఈ వేడుకల్లో అధ్యక్షుడు అశోక్ దూసరి, జాహ్నవి దుసరి, సతీష్ రెడ్డి, శ్రీకత్ రెడ్డి జింకల, సుస్మిత, శ్రీనివాస, లక్ష్మి, హర్ష రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, సుమన్ గోలి, నీలిమ, మధు గులైగారి, భావన, జీవన్, మమత, మహేందర్, శ్వేతా, అనిల్, మల్ల రెడ్డి, శుశమున, శేఖర్, అనిత, హరి నవాబుపేట్, స్నేహ, వీర్, సృజన, సైది రెడ్డి, హారిక యడవల్లి, అభిలాష్ రావు, సమిత, , సంతోష్, వర్ష, నాగార్జున, అనూష, వేణు, నీలిమ, భాను, శ్రీకాంత్ జెల్ల, శైలజ, పవన్, మాధురి, నరేష్ జక్కుల, శశి దొడ్లే, మౌనిక అవినాష్, ప్రత్యూష, భూషణ్, మధు, శివ సిన్నం, సంజీవ్, నిహారిక, సురేందర్, రూప్, వీణ, శ్రీమన్నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, సంధ్య, సత్యపాల్ రెడ్డి, విద్య, మోహన్ , త్రివేద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
APP Link https://rb.gy/lfp2r
http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/
- HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA
సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో నటించాలని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.
ఒక్క నటనా రంగమే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్రతిభ చూపించే వాళ్లు ఎందరో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజన్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్లకు ఒక ప్లాట్‌ఫాం వచ్చేసింది.
అవకాశాలు ఇచ్చేవాళ్లను – అవకాశం తీసుకునే వాళ్లను ఒకే చోట కలుపుతుంది HyStar అనే డిజిటల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫస్ట్ టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్లకు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవకాశాలు అందుకొండి.
#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar
for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php
ప్రవాసులకు ‘స్వదేశం’ సేవలు!
ప్రవాసులకు గుడ్‌న్యూస్. NRI లకు భారత్ నుంచి విభిన్న సేవలు అందించేందుకు ‘స్వదేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభమైన ‘స్వదేశం’ సేవలు ప్రపంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవచ్చు. ప్రవాసులకు తక్కువ చార్జీలతోనే తమ సేవలు అందిస్తున్నారు.
ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవసరం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వస్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాలనుకుంటున్న సర్వీసు ఏంటో చెబుతూ తమ వివరాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ తర్వాత 48 గంటల్లోపే SWADESAM ప్రతినిధులు స్పందించి తాము కోరుకున్న సర్వీసుకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
BREAKINGNEWS APP
ఎప్పటికప్పుడు మన వార్తల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్లోడ్ చేసుకొండి
- BREAKINGNEWS TV
BREAKINGNEWS APP
Breaking News APP