విడుద‌ల తేది: 11-11-2022
న‌టీన‌టులు:
హీరో: అనిరూద్ స‌మీర్ (వ‌రుణ్)
హీరోయిన్: ఐశ్వ‌ర్య (వైష్ణ‌వి)
సెకండ్ హీరో: మ‌హేష్ య‌ద‌ల్ల‌ప‌ల్లి (కార్తీక్)
జానీ నాయుడు, బుజ్జి.. త‌దిత‌రులు
టెక్నిషియ‌న్స్:
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – వివేక్ క‌వ‌టి
ఎడిట‌ర్ – సాయి భర‌ద్వాజ్ విప్ప‌ర్తి
డైలాగ్స్ – రాయుడు బండి
డీవోపీ – ఓం ఎస్ భ‌ర‌ద్వాజ్
మ్యూజిక్ – భ‌ర‌త్ ధ‌న‌శేఖ‌ర్
డైరెక్ట‌ర్ – విన‌య్ ముప్ప‌ల్ల‌

తెలుగులో మ‌రో యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సినీమార్ క‌న్సెప్ట్ బ్యాన‌ర్‌పై కాద‌ల్ క‌హాని సినిమా న‌వంబ‌ర్ 11న రిలీజ్ అయింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

క‌థ‌:
వ‌రుణ్(అనిరూద్ స‌మీర్) హ్యాపీగా జాలీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. అత‌నికి స్వ‌రూప్(జానీ నాయుడు) అనే వ్య‌క్తి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. వ‌రుణ్‌కు సినిమా డైరెక్ట‌ర్ అవ్వాల‌ని కోరిక‌. అందుకోసం ప్ర‌య‌త్నిస్తుంటాడు. ఇలా ఉండ‌గా వాళ్లు ఉండే వీధిలోకి వైష్ణ‌వి(ఐశ్వ‌ర్య) అనే అమ్మాయి కొత్త‌గా వ‌స్తారు.
వాళ్ల‌కు ఆ ఏరియా కొత్త అవ్వ‌డంతో వ‌రుణ్ వాళ్ల‌కి హెల్ప్ చేస్తాడు. ఇలా ఉండ‌గా వైష్ణ‌వి వాళ్ల పెంట్‌హౌస్‌లోకి కార్తీక్ అద్దెకి వ‌స్తాడు. ఆ విష‌యం తెలిసి వైష్ణ‌వి త‌న‌ని ఇంటి నుంచి ఖాళీ చేయ‌మ‌ని అమ్మ‌(ర‌మా)కు చెబుతుంది. అనుకోకుండా ఒక స‌మ‌యంలో ర‌మా హార్ట్ ఎటాక్ కు గురి అవ్వ‌తో కార్తీక్ వెంట‌నే ర‌మాని హ‌స్పిట‌ల్‌కి తీసుకెళ్ల‌డంతో ఆమె సేవ్ అవుతుంది. దాంతో కార్తీక్ – వైష్ణ‌వి మ‌ధ్య ఫ్రెండ్షిప్ ఏర్ప‌డుతుంది. చివ‌రికి వ‌రుణ్‌.. వైష్ణ‌వి పుట్టిన రోజుకు త‌న ప్రేమ విష‌యం చెబుతా అని అనుకుంటాడు.
కానీ అదే రోజు కార్తీక్ కంటే ముందే వ‌రుణ్ చెబుతాడు. వైష్ణ‌వి కార్తీక్ ప్రేమ‌ని ఒప్పుకుంటుందా? వ‌రుణ్ ఏ నిర్ణ‌యం తీసుకుంటాడు అనేదే సినిమా క‌థ‌నం.

న‌టీన‌టులు:
వ‌రుణ్ పాత్ర‌లో అనిరూద్ స‌మీర్, వైష్ణ‌వి పాత్ర‌లో ఐశ్వ‌ర్య చ‌క్క‌గా న‌టించారు. కార్తీక్ పాత్ర‌లో మ‌హేష్ కూడా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడు. మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన వారు కూడా ప‌ర‌వాలేదు.

విశ్లేష‌ణ‌:
యూత్ ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చిన చిత్రం ఇది. స‌మాజంలో సాధారణంగా ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీలు చూస్తుంటాం. అలాంటి స‌బ్జెక్టుతో వ‌చ్చిన ఈ సినిమా యూత్‌ను ఒక ద‌శ‌లో ఎమోష‌న్‌కు గురి చేస్తుంది. యూత్‌కు న‌చ్చేలా సినిమా తీయ‌డంలో డైరెక్ట‌ర్ విన‌య్ ముప్ప‌ల్ల స‌క్సెస్ అయ్యాడు. కొత్త‌వాళ్లు చేసిన సినిమా అని అనిపించ‌దు. ఇక ఈ సినిమా పాట‌లు కూడా అల‌రిస్తాయి. మొత్తానికి ఈ సినిమా ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది.

రేటింగ్: 3.25 / 5

By admin