▪️ రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే పార్టీ
▪️ కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి
▪️ సక్రమంగా నీళ్లు, నిధులు, నియామకాలు
– ఎన్నారై బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి
▪️ కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలి: పంజాబ్, గుజరాత్ కమ్యూనిటీ లీడర్లు

మెల్బోన్: ఎన్నారై బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో మెల్బోన్ లో “కేసీఆర్ కృతజ్ఞత సభ” ఘనంగా నిర్వహించారు. దేశంలో రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతు రుణమాఫీ, రైతు భీమా వంటి పథకాల్ని ప్రవేశపెట్టడమే కాకుండా అహర్నిశలు వారి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు, అలాగే ఇటీవల కాలంలో ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సందర్భంగా సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ నిర్వహించడం జరిగిందని ఎన్నారై బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ పార్టీ రైతు పక్షపాత పార్టీ అని రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే పార్టీ అని చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగిందని అన్ని కులాలు అన్ని మతాల వారికి సంక్షేమ పథకాలు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్ని రంగాలలో ఇక కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, మున్ముందు కూడా అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌ పార్టీకే పట్టం కట్టాలని, తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే అది బీఆర్ఎస్‌ పార్టీతోనే సాధ్యమని ఎన్నారైలు ప్రగాఢంగా భావించారని తెలిపారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుందని, ఎన్నారైలో ఉన్న చాలామంది రైతు కుటుంబాలు నుండి వచ్చిన వాళ్లే అని, రైతుల ఇబ్బందులు తెలుసుకొని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని కొనియాడారు బీఆర్ఎస్‌ పార్టీ ఏ నినాదంతో అయితే అధికారంలోకి వచ్చిందో నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని కొనియాడారు మరొకసారి తెలంగాణ లో అధికారం బీఆర్ఎస్‌ పార్టీకే కట్టబెట్టాలని ఎన్నారై లందరూ కోరుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో పంజాబ్, గుజరాత్ కమ్యూనిటీ కి సంబంధించిన లీడర్లు మాట్లాడుతూ కేసీఆర్ భారత దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని, ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి పరిమితం కాకుండా రానున్న రోజుల్లో దేశానికి నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో లాగానే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆశించారు.

ఆస్ట్రేలియా లో BRS పార్టీ కార్యాక్రమాలు నిర్వహించే అవకాశం కలిపించిన పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కి , వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి , ఎమ్మెల్సీ కవితకి కృతఙ్ఞతలు తెలిపారు ఎన్నారై BRS ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు రమేష్ ముత్యాల, మధు పార్స, రవీందర్ చుక్క, సత్యనారాయణ గుండా, మధు పైల, కార్తీక్, విద్యాసాగర్ రాయల, సాయిరాం సందీప్, అనిల్ వంశీ, సురభి కుల్విందర్, బాజువ హర్మేందర్ సింగ్, దిలీప్ రెడ్డి, అవినాష్, సంతోష్ రెడ్డి, గోపి, శ్రవణ్ బల్మూరి, అనిల్, రాఘవేంద్ర, ఆకాష్, సురేష్ రేపాల, అవినాష్, ఆకాష్, ఇతర తెలంగాణ సంఘ నాయకులు పుల్లారెడ్డి, రాజు వర్ధన్ రెడ్డి, దీపక్ కిరణ్, ప్రవీణ్ దేశం, కర్ర శ్రీనివాస్, నవీన్ బైరెడ్డి, ఓబుల్ రెడ్డి, హరీష్ రెడ్డి, శేఖర్, శ్రీకాంత్, శ్రీధర్ పలువురు పాల్గొన్నారు.

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

APP Link  https://rb.gy/lfp2r

BREAKINGNEWS TV

http://www.globaltimes.tv/swadesam-your-trusted-partner-for-nri-services/

 

 

HYSTAR - TALENT HUB

HYSTAR – TALENT HUB 🎥 CINEMA ▪️ OTT ▪️AD ▪️MEDIA

సినిమా ఒక రంగుల ప్రపంచం. సినీ లోకంలో విహరించాలని ఎందరో కలలు కంటుంటారు. ‘ఒక్క ఛాన్స్’ దొరక్కపోతుందా అని ఎదురు చూస్తారు. సినిమాల్లో న‌టించాల‌ని, టీవీలో కనిపించాలని.. తామెంటో నిరూపించుకోవాలని నటన వైపు అడుగులు వేస్తుంటారు.

ఒక్క‌ న‌ట‌నా రంగ‌మే కాదు 24 క్రాఫ్టుల్లోనూ ప్ర‌తిభ చూపించే వాళ్లు ఎంద‌రో. కేవలం Actorsగా ఎదగాలనుకునేవారు మాత్రమే కాదు.. Models, Anchors, Writers, Directors, Singers…. ఇలా అన్ని డిపార్ట్‏మెంట్స్‏లో రాణించాలనుకుంటారు. కానీ ఎవరిని సంప్రదించాలి..? ఎలా కలవాలి..? సినిమా.. టెలివిజ‌న్ రంగాలలో ఛాన్స్ రావాలంటే ఎక్కడ అవకాశం ఉందనే విష‌యం చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ల‌కు ఒక ప్లాట్‌ఫాం వ‌చ్చేసింది.

అవ‌కాశాలు ఇచ్చేవాళ్ల‌ను – అవ‌కాశం తీసుకునే వాళ్ల‌ను ఒకే చోట క‌లుపుతుంది HyStar అనే డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం. ఇండియాలోనే ఫ‌స్ట్ టాలెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫామ్ HyStar ఛాన్స్‌లు ఇచ్చేవాళ్లకు – తీసుకునే వాళ్ల‌కు ఒకే ఫ్లాట్‌ఫాం 24 క్రాప్టులకు ఒకే APP HyStar లో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొండి. సినిమా, టీవీ, ఓటీటీ, యాడ్స్.. రంగాల్లో అవ‌కాశాలు అందుకొండి.

#HyStarAPP & Website మీకోసమే! for android users HyStar APP in Google PlayStore
https://play.google.com/store/apps/details?id=com.esalemedia.hystar

for iPhone & all users (website)
https://hystar.in/app/visitor/register.php

ప్ర‌వాసుల‌కు ‘స్వదేశం’ సేవ‌లు!

ప్ర‌వాసుల‌కు గుడ్‌న్యూస్. NRI ల‌కు భార‌త్ నుంచి విభిన్న సేవ‌లు అందించేందుకు ‘స్వ‌దేశం’ సిద్ధంగా ఉంది. MediaBoss సంస్థ నుంచి ప్రారంభ‌మైన ‘స్వ‌దేశం’ సేవ‌లు ప్ర‌పంచంలోని అన్నీ దేశాల్లో ఉన్న NRIలు పొందవ‌చ్చు. ప్ర‌వాసుల‌కు త‌క్కువ చార్జీల‌తోనే త‌మ సేవ‌లు అందిస్తున్నారు.

ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవ‌స‌రం ఉన్నా కూడా www.swadesam.com సైట్‌కు వ‌స్తే చాలు. అందులో ఉన్న https://forms.gle/FPu3LuNLyjEnyqgf7 ఫామ్‌లో తాము పొందాల‌నుకుంటున్న‌ స‌ర్వీసు ఏంటో చెబుతూ త‌మ‌ వివ‌రాలు TEXT రూపంలో ఇచ్చి Submit చేయాలి. ఆ త‌ర్వాత‌ 48 గంట‌ల్లోపే SWADESAM ప్ర‌తినిధులు స్పందించి తాము కోరుకున్న స‌ర్వీసుకు సంబంధించిన‌ వివ‌రాల‌ను అందిస్తారు.

 

BREAKINGNEWS APP
ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న వార్త‌ల కోసం ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి
Breaking News APP డౌన్‌లోడ్ చేసుకొండి

https://rb.gy/lfp2r 

BREAKINGNEWS TV

  • BREAKINGNEWS TV

https://play.google.com/store/apps/details?id=com.mediaboss.breakingnews

BREAKINGNEWS TV & APP

BREAKINGNEWS APP
Breaking News APP

https://rb.gy/lfp2r 

 

By admin